రెమ్యూనరేషన్ విషయంలో చిరు రికార్డు.. ఏ స్టార్ హీరోకూ దక్కని ఘనత సొంతం.!

By Manoj Kumar P

'ఖైదీ నెంబర్ 150'తో తన కమ్ బ్యాక్‌ను ఘనంగా చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ ఊపులోనే తన 151వ సినిమా 'సైరా: నరసింహారెడ్డి'ను కూడా పట్టాలెక్కించేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను రామ్ చరణ్ తన సొంత బ్యానర్ కొణెదల ప్రొడక్షన్స్‌పై స్వయంగా నిర్మించాడు.

ఎన్నో అంచనాలతో విడుదల అయిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. దీంతో సైరా సూపర్ సక్సెస్ అయింది. ఈ ఉత్సాహంతో మరో సినిమాను మొదలు పెట్టబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. సినిమా షూటింగ్ ప్రారంభం కాక ముందే దీనిపై ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

బడా డైరెక్టర్‌తో సినిమా

బడా డైరెక్టర్‌తో సినిమా

‘సైరా' షూటింగ్ జరుగుతుండగానే టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీనికి కూడా చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. మ్యాట్నీ మూవీస్ సంస్థ సహా నిర్మాతగా వ్యవహరించనుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే చిత్ర రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

మరో సోషల్ పాయింట్‌తో వస్తున్నాడు

మరో సోషల్ పాయింట్‌తో వస్తున్నాడు

తన సినిమాల్లో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉండేలా చూసుకుంటాడు డైరెక్టర్ కొరటాల శివ. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాల్లోనూ ఇదే తరహాను ఫాలో అయ్యాడు. ఇప్పుడు చిరంజీవితో చేసే సినిమాలోనూ ఓ సందేశాన్ని ఇవ్వబోతున్నాడట. ఇందులో దేవాదాయ భూములకు సంబంధించిన అంశాలను చూపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

ఐశ్వర్య రాయ్ నుంచి త్రిష

ఐశ్వర్య రాయ్ నుంచి త్రిష

ఈ సినిమాలో చిరు సరసన నటించే హీరోయిన్ విషయపై ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. గతంలో ఈ సినిమా కోసం మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ను సంప్రదించారని వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత నయనతారను తీసుకుంటున్నారని అన్నారు. ఇక, రెండు మూడు రోజులుగా చిరు సరసన త్రిషను నటింపజేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఒక్కరు కాదు ఇద్దరు

ఒక్కరు కాదు ఇద్దరు

ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తన కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150'లో సైతం ఆయన డబుల్ రోల్ చేశారు. ఇక, కొరటాల సినిమాలోనూ అది రిపీట్ చేయబోతున్నారని సమాచారం. ఇందులో చిరు తండ్రి, కొడుకుగా కనిపించబోతున్నారట. ఈ రెండు పాత్రలూ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయని టాక్.

 భారీ రెమ్యూనరేషన్

భారీ రెమ్యూనరేషన్

ఈ సినిమాను రామ్ చరణ్‌తో పాటు మ్యాట్నీ మూవీస్ సంస్థ కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రెండు నిర్మాణ సంస్థలు పాలు పంచుకోవడంతో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తారని అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమా కోసం చిరు రెమ్యూనరేషన్ కింద కొన్ని ఏరియాల రైట్స్ తీసుకుంటున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. వీటి విలువ రూ. 50 కోట్లు ఉంటుందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

 చిరుదే టాప్ ప్లేస్

చిరుదే టాప్ ప్లేస్

ప్రస్తుతం ఉన్న తెలుగు హీరోల్లో కొందరు మాత్రమే రూ. 40 కోట్లు రెమ్యూనరేషన్‌ను తీసుకుంటున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అది కూడా పలు రకాల సెటిల్‌మెంట్ల ద్వారా అంత మొత్తం అవుతుందట. అయితే, ఇప్పుడు చిరు రూ. 50 కోట్లు తీసుకుంటే ఆయనదే టాప్ ప్లేస్ అవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X