For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘Acharya’ నుంచి మరో భారీ లీక్: ఆ సీన్‌ చూపించేందుకు చిరంజీవి నో.. ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవచ్చు

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలోనే ఎన్నో అలాంటి చిత్రాలు ప్రేక్షకులను కనువిందు చేశాయి. వాటిలో చాలా వరకూ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో దర్శక నిర్మాతలు, హీరోలు ఆ తరహా సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే మెగా ఫ్యామిలీ నుంచి ఓ భారీ మల్టీస్టారర్ మూవీ రాబోతుంది. అదే చిరంజీవి - రామ్ చరణ్ కలయికలో రూపొందుతోన్న 'ఆచార్య'. తాజాగా ఈ సినిమా నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆ వివరాలు మీకోసం!

  కొడుకుతో కలిసి రాబోతున్న ‘ఆచార్య'

  కొడుకుతో కలిసి రాబోతున్న ‘ఆచార్య'

  మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ కలయికలో రూపొందుతోన్న చిత్రమే ‘ఆచార్య'. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు. మెగా మల్టీస్టారర్‌గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

  సినిమా నేపథ్యం ఇదే.. ఇద్దరిదీ ఒకేలా

  సినిమా నేపథ్యం ఇదే.. ఇద్దరిదీ ఒకేలా

  నక్సలైట్ల బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోన్న చిత్రమే ‘ఆచార్య'. ఇందులో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నక్సలైట్లుగానే నటిస్తున్నారు. ఓ మిషన్ సమయంలో సిద్ధ పాత్ర మరణించగా.. దాన్ని ఆచార్య ఎలా పూర్తి చేశాడన్న నేపథ్యంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక, ఈ సినిమాలో చరణ్ పాత్ర ఎంతో ముఖ్యమైనదట. దాదాపు 30 నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర చనిపోతుందని టాక్.

  భారీ ఖర్చు... ఇండియాలోనే తొలిసారి

  భారీ ఖర్చు... ఇండియాలోనే తొలిసారి

  మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రాబోతున్న చిత్రం ‘ఆచార్య'. దీన్ని నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో ఇండియాలోనే పెద్దదైన టెంపుల్ టౌన్‌ సెట్‌ను కూడా నిర్మించారు. అలాగే, స్టార్ కాస్ట్‌ను కూడా తీసుకున్నారు. మొత్తంగా ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

  అంచనాలు పెంచిన టీజర్.. బిజినెస్‌తో

  అంచనాలు పెంచిన టీజర్.. బిజినెస్‌తో

  కొద్ది రోజుల క్రితం ‘ఆచార్య' టీజర్ విడుదలైంది. అందులో ఓ పవర్‌ఫుల్ ఫైట్‌తో పాటు పంచ్ డైలాగ్‌తో మెగాస్టార్ చిరంజీవి మెప్పించారు. దీంతో ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. అదే సమయంలో అంచనాలు రెట్టింపయ్యాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ బిజినెస్‌ రికార్డు స్థాయిలో జరిగిందని టాక్.

  ‘ఆచార్య' విడుదల వాయిదా.. అప్పుడే

  ‘ఆచార్య' విడుదల వాయిదా.. అప్పుడే

  ‘ఆచార్య' మూవీ షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోంది. ఈ క్రమంలోనే పలు కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఈ సినిమాను మే 13న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా 14 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ పడిపోయింది. దీంతో రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఇప్పుడు ఇది సంక్రాంతి వస్తుందని అంటున్నారు.

  ‘ఆచార్య' మూవీ నుంచి షాకింగ్ న్యూస్

  ‘ఆచార్య' మూవీ నుంచి షాకింగ్ న్యూస్

  రోజులు గడుస్తోన్న కొద్దీ ‘ఆచార్య' మూవీపై ఆసక్తి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ గురించి, అందులో నటించే నటీనటుల పాత్రల గురించి ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. దీంతో అంచనాలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రంలోని రామ్ చరణ్ పోషించే ‘సిద్ధ' పాత్ర గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

  BA Raju : Mahesh Babu కి Loyal PRO, Tollywood Encyclopaedia || Filmibeat Telugu
  ఆ సీన్ చూపించేందుకు చిరంజీవి నో

  ఆ సీన్ చూపించేందుకు చిరంజీవి నో

  ‘ఆచార్య' మూవీలో రామ్ చరణ్ పాత్ర చనిపోతుందన్న వార్త ఎప్పటి నుంచో ప్రచారం అవుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో సిద్ధ చనిపోయే సీన్‌ను మాత్రం చూపించరట. వాస్తవానికి చిరంజీవి చేతిలోనే చరణ్ పాత్ర చనిపోయేలా కొరటాల కథను రాసుకున్నాడట. కానీ, అది నచ్చని మెగాస్టార్.. ఆ సీన్ లేపేశాడట. అంటే ఆ పాత్ర కనుమరుగయ్యేలా చేశారని తెలిసింది.

  English summary
  Megastar Chiranjeevi - Ram Charan Upcoming Film is Acharya. This movie directed by Koratala Siva. Latest News is That.. No Ram Charan Death Scene in Acharya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X