విడుదలకు ముందే బయటకు: ‘ఆచార్య’ టీజర్ హైలైట్స్ ఇవే.. చివరి ఐదు సెకెన్స్ అరాచకమే!

దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. కొన్నేళ్ల క్రితం రాజకీయాల కోసం సినిమాలకు బ్రేకిచ్చిన ఆయన.. సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150' అనే మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆయన మరింత ఉత్సాహంగా పని చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ వెంటనే 'సైరా: నరసింహారెడ్డి' చేయడంతో పాటు ప్రస్తుతం 'ఆచార్య' అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ నేడు విడుదల కానుంది. కానీ, అందులోని హైలైట్స్ ముందు బయటకు వచ్చాయి. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

కియారా గ్లామర్ మోత.. వైరల్‌గా లేటేస్ట్ ఫోటోషూట్

 హిట్ కోసం బడా డైరెక్టర్‌తో చిరు జోడీ

హిట్ కోసం బడా డైరెక్టర్‌తో చిరు జోడీ

కమ్‌బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150'తో హిట్ కొట్టినా.. ఆ తర్వాత వచ్చిన 'సైరా: నరసింహారెడ్డి'తో మాత్రం మెగాస్టార్ చిరంజీవికి నిరాశే ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారాయన. ఇందుకోసం బడా డైరెక్టర్ కొరటాల శివతో కలిసి 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ దీన్ని నిర్మిస్తున్నాయి.

 ఆ స్టార్ హీరో ఎంట్రీతో మారిన పరిస్థితి

ఆ స్టార్ హీరో ఎంట్రీతో మారిన పరిస్థితి

ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడని ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం జరుగుతోంది. కానీ, చిరంజీవి ఒక్కరితోనే ఇది తెరకెక్కుతోందని అన్నారు. అయితే, ఊహించని విధంగా ఇందులో చరణ్ కూడా రోల్ రాశారు కొరటాల. అతడి ఎంట్రీతో మొత్తం మారిపోయింది. ఇక, కాజల్ హీరోయిన్‌గా చేస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మరోసారి అదే తరహా సినిమాతో రెడీ

మరోసారి అదే తరహా సినిమాతో రెడీ

కొరటాల శివ సినిమాలు అంటేనే సందేశాత్మకంగా ఉంటాయి. అందుకు అనుగుణంగానే 'ఆచార్య'లోనూ దేవాదాయ భూముల గురించిన మెసేజ్ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇందులో చరణ్ నక్సలైట్ పాత్రను చేస్తుండగా.. ఓ మంచి పని కోసం అతడు చనిపోతాడని.. దాన్ని ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి నక్సలైట్‌గా మారిన చిరంజీవి పూర్తి చేస్తాడని తెలుస్తోంది.

సర్‌ప్రైజింగ్ అప్‌డేట్‌ రెడీ చేసేశారుగా

సర్‌ప్రైజింగ్ అప్‌డేట్‌ రెడీ చేసేశారుగా

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆచార్య'పై మెగా ఫ్యాన్స్‌ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో మెగా మల్టీస్టారర్‌గా వస్తోన్న ఈ మూవీ టీజర్‌ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేస్తారని జోరుగా ప్రచారం జరిగినా అది నిజం కాలేదు. ఈ నేపథ్యంలో దీన్ని జనవరి 29, సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

‘ఆచార్య' టీజర్ హైలైట్స్.. బయటకు

‘ఆచార్య' టీజర్ హైలైట్స్.. బయటకు

టైటిల్, నటీనటులు, షూటింగ్ అప్‌డేట్, టెంపుల్ టౌన్ సెట్ ఇలా.. 'ఆచార్య'కు సంబంధించిన ఎన్నో విషయాలు చిత్ర యూనిట్ రివీల్ చేయడానికి ముందే లీక్ అవుతూ వస్తున్నాయి. అదే క్రమంలోనే ఇప్పుడు టీజర్‌లోని హైలైట్స్ కూడా విడుదలకు ముందే బయటకు వచ్చాయి. ఈ టీజర్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని ముందే తెలిసింది.

Recommended Video

Acharya Teaser : నిడివి నిమిషం పైనే.. చిరు పవర్ ఫుల్ డైలాగ్ తో.. Chiranjeevi | Ram Charan
టీజర్‌లో చివరి ఐదు సెకెన్స్ అరాచకమే

టీజర్‌లో చివరి ఐదు సెకెన్స్ అరాచకమే

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ వీడియో 1.32 నిమిషాలు ఉంటుందని తెలిసింది. ఇందులో మొత్తం చిరంజీవినే చూపించారట. అలాగే, ఓ అద్భుతమైన డైలాగ్ కూడా ఉంటుందని సమాచారం. అంతేకాదు, చివరి ఐదు సెకెన్లలో రామ్ చరణ్ పాత్రను వెనుక నుంచి చూపిస్తారట. ఇక, ఈ టీజర్‌కు మణిశర్మ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X