Bholaa Shankar: మెహర్ రమేష్‌కు చిరంజీవి షాక్.. అప్పటి వరకూ దీన్ని మొదలు పెట్టరట

ఎవరి అండదండలు లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ సత్తా చాటుతోన్న ఆయన.. ఆరు పదుల వయసులోనూ అదే గ్రేస్‌ను చూపిస్తూ ఫిదా చేస్తున్నారు. ఇక, సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ చరణ్‌తో కలిసి 'ఆచార్య' అనే సినిమాను చేస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే ఆయన మరో మూడు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారు. అందులో ఒకటి మలయాళ చిత్రం లూసీఫర్‌కు రీమేక్‌గా వస్తున్న 'గాడ్ ఫాదర్' కాగా.. మరొకటి తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా వస్తున్న 'భోళా శంకర్'. వీటితో పాటు యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలోనూ మరో సినిమాను చేస్తున్నారు. ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి పూర్తి చేయాలని చిరంజీవి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే 'గాడ్ ఫాదర్' మూవీని పట్టాలెక్కించిన ఆయన.. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అంతేకాదు, ఓ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసేశారు.

Chiranjeevis Bholaa Shankar Movie Will Start Next Year

ఇక, చిరంజీవి ఇప్పుడు చేస్తున్న చిత్రాల్లో 'భోళా శంకర్' ఒకటి. దీన్ని టాలీవుడ్‌లో ఫ్లాప్ దర్శకుడిగా పేరొందిన మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు. సిస్టర్ సెంటిమెంట్ స్టోరీతో రూపొందనున్న ఈ సినిమాలో హీరో సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఇప్పటికే దర్శకుడు కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాల్లో ట్రయల్ షూట్ కూడా పూర్తి చేశాడట. అలాగే, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. అంతేకాదు, ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలు పెట్టేశారు.

తాజాగా 'భోళా శంకర్' సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. దీన్ని చిరంజీవి చేయబోయే 154వ సినిమా అని అన్నారు. అయితే, ఆ స్థానంలో కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతో చేసే ప్రాజెక్టును తీసుకొచ్చారు. అంటే 'భోళా శంకర్' చిరంజీవి 155వ చిత్రం అయింది. ఇక, బాబీ సినిమాను ఈ ఏడాది నవంబర్‌లో ప్రారంభిస్తారని ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది. ఈ నేపథ్యంలో మెహర్ రమేష్‌తో చేసే సినిమాను వచ్చే ఏడాది వరకూ ప్రారంభించరని తెలిసింది. మొత్తానికి 'గాడ్ ఫాదర్' పూర్తై.. బాబీ సినిమా చాలా వరకూ అయిన తర్వాతనే దీన్ని మొదలు పెట్టాలని చిరంజీవి డిసైడ్ అయ్యాడట.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'భోళా శంకర్' మూవీలో మెగాస్టార్ చిరంజీవి టాక్సీ డ్రైవర్‌గా గుండుతో కనిపించబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇది ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. తమిళ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి దీన్ని మెహర్ రమేశ్ తెరకెక్కించబోతున్నాడు. ఇందులో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అలాగే, ఇందులో బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటింబోతుంది. మహతి స్వర సాగర్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X