For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆదిలోనే ‘గాడ్ ఫాదర్’కు ఆటంకం: ఆగిపోయిన చిరంజీవి సినిమా.. ఆయన వెళ్లిపోవడమే కారణం!

  |

  మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో ఫుల్ జోష్‌ మీద కనిపిస్తున్నారు. 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ వెంటనే 'సైరా: నరసింహారెడ్డి' అనే మూవీలో నటించారు. దీని తర్వాత సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో 'ఆచార్య' అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైనా అనివార్య కారణాలతో చిత్రీకరణను సరిగా జరుపుకోలేదు. దీంతో మిగిలిన ప్రాజెక్టులపై ఆ ప్రభావం పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే తన కొత్త సినిమాను పట్టాలెక్కించారు చిరంజీవి. ఈ మూవీ ఆదిలోనే ఆగిపోయినట్లు తాజాగా తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

  అక్కడ సూపర్ స్టార్.. ఇక్కడ మెగాస్టార్

  అక్కడ సూపర్ స్టార్.. ఇక్కడ మెగాస్టార్

  మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల హీరోగా పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన చిత్రమే ‘లూసీఫర్'. ఈ సినిమా తెలుగు సహా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని చోట్లా దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దీన్నే ‘గాడ్ ఫాదర్'గా చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా రూపొందిస్తున్నాడు.

  అభిమాని పెళ్లిలో పవన్ కల్యాణ్: ఇదేం క్రేజురా నాయనా.. తల్లిదండ్రులను కూడా కాదని పవర్‌స్టార్‌తో!

  అన్నీ మార్చేసి... దాన్ని యాడ్ చేశాడు

  అన్నీ మార్చేసి... దాన్ని యాడ్ చేశాడు

  మలయాళంలో తెరకెక్కిన ‘లూసీఫర్' మూవీని.. తెలుగులో రీమేక్ చేయడం కోసం మొదట యంగ్ డైరెక్టర్ సుజిత్ తీసుకున్నారు. కానీ, అనివార్య కారణాలతో అతడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత మోహన్ రాజా దీన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చాడు. అలాగే, ఇందులో హీరోయిన్ పాత్రను కూడా జత చేశాడు. హీరో పాత్రను కూడా ఎలివేట్ చేశాడట.

  ముఖ్యమైన పాత్రల్లో నయన్, సత్యదేవ్

  ముఖ్యమైన పాత్రల్లో నయన్, సత్యదేవ్

  పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోన్న ‘గాడ్ ఫాదర్' మూవీలో నయనతార, సత్యదేవ్ పోషించే పాత్రల గురించి ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. మలయాళంలో మంజు వారియర్ పోషించిన హీరో సోదరి పాత్రను నయనతార చేస్తుందట. అలాగే, ఆమె భర్తగా నటించిన వివేక్ ఒబెరాయ్ రోల్‌ను టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  టూపీస్ బికినీలో రామ్ చరణ్ భామ ఘాటు ఫోజులు: బట్టలు ఉన్నా లేనట్లే మరీ దారుణంగా!

  ఈ ప్రాజెక్టులో భాగమైన సల్మాన్ ఖాన్

  ఈ ప్రాజెక్టులో భాగమైన సల్మాన్ ఖాన్

  మలయాళంలో ‘లూసీఫర్' మూవీలో హీరోకు సహాయం చేసే ఓ డాన్ రోల్ కూడా ఉంటుంది. మలయాళంలో ఆ పాత్రను పృథ్వీ రాజ్ సుకుమారన్ చేశాడు. అయితే, తెలుగులో ఆ రోల్ ఎవరు చేస్తారన్న దానిపై చాలా రోజులుగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పాత్రకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను తీసుకున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

  ‘గాడ్ ఫాదర్' మూవీకి అప్పుడే ఆటంకం

  ‘గాడ్ ఫాదర్' మూవీకి అప్పుడే ఆటంకం

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ‘గాడ్ ఫాదర్' మూవీని ఇటీవలే అధికారికంగా ప్రారంభించారు. ఆరంభంలోనే యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా షూట్ చేశారు. ఇలా నిర్విరామంగా చిత్రీకరణ జరుగుతోన్న సమయంలోనే ఈ మూవీకి అనుకోని కష్టం వచ్చిందట. దీంతో ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయిందని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

  ఒకేసారి అంత మంది అమ్మాయిలతో ఎఫైర్స్: యాంకర్ ప్రదీప్ పరువు తీసేసిన సీరియల్ నటి

  Bheemla Nayak Vs Acharya.. ఏమి సేతుర సామీ ! || Filmibeat Telugu
  ఆయన వెళ్లిపోవడమే కారణం అంటూ

  ఆయన వెళ్లిపోవడమే కారణం అంటూ

  ‘గాడ్ ఫాదర్' సినిమా షూటింగ్ ఆగిపోవడానికి కారణం ఇదేనంటూ ఓ న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఈ చిత్రానికి నీరవ్ షా కెమెరామెన్‌గా చేస్తున్నారు. ఆయన తమిళంలో అజిత్ హీరోగా వస్తున్న ‘వాలిమై'కు కూడా పని చేస్తున్నారు. నాలుగు రోజుల షూట్ కోసం ఆయన చెన్నై వెళ్లారట. అందుకే చిరంజీవి సినిమా షూటింగ్‌ను నీరవ్ లేని కారణంగా ఆపారనే టాక్ వినిపిస్తోంది.

  English summary
  Tollywood Star Hero Megastar Chiranjeevi doing God Father Under Mohan Raja Direction. Now Cinematographer Nirav Shah Left From This Movie Shooting.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X