చిరంజీవి సినిమాలకు లీకుల షాక్.. లూసిఫర్ రీమేక్ టైటిల్ ఇదే అంటూ...
పదేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. లాక్‌డౌన్ కారణంగా సినిమాల షూటింగు, విడుదలలో జాప్యం జరిగింది. లేకపోతే సైరా తర్వాత మరో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేవి. అయితే తాజాగా చిరంజీవి నటిస్తున్న రెండు సినిమాలకు సంబంధించిన టైటిల్స్ వ్యవహారం మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

చిరంజీవి మూడు సినిమాలతో
దర్శకుడు కొరటాల శివతో ఆచార్య షూటింగు జరుగుతుండగానే.. మోహన్ రాజా, కేఎస్ రవీంద్ర (బాబీ), మెహర్ రమేష్ లాంటి దర్శకులతో సినిమాలను ప్లాన్ చేశారు. లూసిఫర్ చిత్రానికి ఎడిటర్ మోహన్ కుమారుడు మోహన్ రాజా మలయాళంలో విజయవంతమైన లూసిఫర్ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

వీరయ్య టైటిల్ కాదంటూ ఖండన
ఇదిలా ఉండగా, కేఎస్ రవీంద్ర, మెహర్ రమేష్ రూపొందించే సినిమాలు స్ట్రెయిట్ సినిమాలు. ఇప్పటికే స్క్రిప్టు ఫైనల్ అయినట్టు తెలుస్తున్నది. అయితే గత రెండు రోజులుగా బాబీ, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చే చిత్రం పేరు వీరయ్య అని ప్రచారం అవుతున్నది. అయితే పీఆర్ వర్గాలు ఆ టైటిల్ కాదంటూ ఖండించారు.

లూసిఫర్ రీమేక్ టైటిల్ ఇదే అంటూ
అయితే తాజాగా లూసీఫర్ రీమేక్‌కు సంబంధించిన టైటిల్ తెరపైకి వచ్చింది. మోహన్ రాజా, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చే చిత్రానికి రారాజు అని పేరు పెట్టాలని డిసైడ్ అయినట్టు తెలుస్తున్నది. గతంలో ఇదే టైటిల్‌తో రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా ఓ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.

టైటిల్‌పై సోషల్ మీడియాలో లొల్లి
రారాజుగా ప్రచారమవుతున్న చిరంజీవి సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, ఎన్‌వీఆర్ ఫిల్మ్స్, మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ టైటిల్‌ను మెగా టీమ్ నిజంగా పరిశీలిస్తున్నదా అనే విషయం కొద్దిరోజులు ఆగితే తెలియడం ఖాయం. అయితే ఈ టైటిల్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చర్చ జరుపుతున్నారు.

లూసిఫర్ రీమేక్‌లో నయనతార..
ఇదిలా ఉండగా, లూసిఫర్ చిత్రాన్ని ఉగాది తర్వాత సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలో నటీనటులు ఎంపిక దాదాపు పూర్తయినట్టు సమాచారం. మంజువారియర్ పాత్రను నయనతార, టోవినో థామస్ పాత్రను సత్యదేవ్ చేస్తున్నట్టు వార్తలు అందుతున్నాయి. ఈ చిత్రం 2022 ప్రథమార్థంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











