Varun Tej Lavanya Wedding: వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లికి మెగా ఫ్యామిలీ మెయిన్ పర్సన్ డుమ్మ.. అసలు ఏమైందంటే?
మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగనున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. నవంబర్ 1న ఈ జంట ఏడు అడుగులు వేయబోతున్నారు. ఇక వీరు ఇటలీలో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ ఇటలీ బయలు దేరింది. అయితే మెగా ఫ్యామిలీలో మెయిన్ పర్సన్ వీరి పెళ్లికి డుమ్మ కొట్టనున్నారట. అసలు ఆ మెయిన్ పర్సన్ ఎవరు.. ఎందుకు ఇటలీకి వెళ్లడం లేదు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నాగాబాబు కుమారుడు వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాఠీలు ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రేమ పక్షుల్లా తిరిగినా.. బయట పడలేదు. ఎట్టకేలకు వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆ మధ్య ప్రకటించారు. ఇక అప్పటి నుంచి వీరి గురించి రోజుకు వార్త వస్తునే ఉంది. ఇక వీరి పెళ్లికి ముహుర్తం కూడా ఫిక్స్ అయింది. ఇటలీలో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు.

ఇక వరుణ్ తేజ్, లావణ్యల డెస్టినేషన్ వెడ్డింగ్ ఇటలీలో గ్రాండ్ గా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయంట. అంతే కాదు మెగా ఫ్యామిలీతో పాటు.. అల్లు ఫ్యామిలీ కూడా ఇటలీ బయలు దేరారని తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ ఉపాసన ముందుగా అక్కడికి వెళ్లి పెళ్లి పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక అక్కడ పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తోంది.
ఇక కొత్త జంటకు సంబంధిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. అయితే వీరి పెళ్లికి మెగాఫ్యామిలీ నుంచి ఓ మెయిన్ పర్సన్ హాజరు కావడం లేదని తెలుస్తోంది. వారు ఎవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి. ఆమె వరుణ్, లావణ్యల పెళ్లికి హాజరు కావడం లేదట. దానికి కారణం కూడా ఉందని తెలుస్తోంది.

మెగా ఫ్యామిలీకి పెద్ద దిక్కు అయిన అంజనా దేవి... ఇటలీకి ఫ్లైట్లో జర్నీ చేయడం అంత సేఫ్ కాదని.. ఆమె ఆరోగ్య రీత్య ఇండియాలోనే ఉంచుతున్నారని టాలీవుడ్ వర్గాల ఇన్ సైడ్ సమాచారం. అయితే ఆమెకు వారి పెళ్లిని లైవ్ లో వీడియో ద్వారా చూపించనున్నారట. అంజనా దేవి వయసు రిత్యా పెద్దావిడ. ఆమె ఆరోగ్య కండిషన్స్ కారణంగా డాక్టర్ సజెస్ట్ చేయడంతో.. ఆమెను ఇటలీకి తీసుకుపోలేదని తెలుస్తోంది.

అయితే అంజనాదేవి వరుణ్ తేజ్ కు నాన్నమ్మ. నాన్నమ్మ బ్లెస్సింగ్స్ లేకుండానే వరుణ్ లావణ్యల పెళ్లి జరగబోతుందని వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక నవంబర్ 5వ తేదీన వరుణ్ తేజ్, లావణ్య రిసెప్షన్ ఉండనుంది. ఇక అక్కడ అంజనా దేవి వారిని ఆశ్విర్వందించి.. సందడి చేయనుందట. మొత్తానికి మెగా ఫ్యామిలీ నుంచి మెయిన్ పర్సన్ మిస్సింగ్ అంటూ నెట్టింట వైరల్ గా మారింది. అయితే అంజనా దేవి ఆశీస్సులు ఇండియాలో ఉన్నా.. ఇటలీలో ఉన్నా.. ఉంటాయని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











