Vishwambhara Release Date: విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్? ఎప్పుడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోయే చిత్రాలపై ప్రస్తుతం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు నెలకున్నాయి. అసలే బాస్ సెకండ్ ఇన్నింగ్స్ లో రూట్ మార్చి సినిమాలు చేస్తుండటం విశేషంగా మారింది. ఇక నెక్ట్స్ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కావాల్సింది. కానీ పలు కారణాలతో మరింతగా ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక తాజాగా విశ్వంభర రిలీజ్ డేట్ పై వార్తలు వచ్చాయి. మేకర్స్ ఆ ప్రత్యేకమైన డేట్ ను లాక్ చేసినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

యంగ్ డైరెక్టర్ కు మెగా ఛాన్స్..
మెగాస్టార్ చిరంజీవి చివరిగా వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు గాడ్ ఫాదర్ తో, తర్వాత వాల్తేరు వీరయ్య బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. ఇక భోళా శంకర్ నిరాశ పరిచింది. ఈ క్రమంలో బింబిసారతో బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన మల్లిడి వశిష్ఠకు డైరెక్షన్ ఛాన్స్ అందించారు. వీరి కాంబోలోనే విశ్వంభర చిత్రం ప్రారంభమైంది. 2023 అక్టోబర్ లోనే షూటింగ్ ప్రారంభమైంది. దాదాపు 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ప్రస్తుతం తుది దశకు చేరుకుంది.

Chiranjeevi s Vishwambhara Movie Release Date will be Announced

విశ్వంభర బడ్జెట్, తదితర వివరాలు..
మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిస్తున్నారు. వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు నిర్మాతలుగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో విశ్వంభర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథన్, ఇషా చావ్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురబి పురానిక్, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

రిలీజ్ డేట్ ఫిక్స్?
విశ్వంభర చిత్రాన్ని మరో 2 నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా అందిన అప్డేట్ ప్రకారం ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ సమావేశమై రెండు డేట్లను లాక్ చేశారంట. సెప్టెంబర్ 18 లేదంటే సెప్టెంబర్ 25న రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారంట. అయితే ఆ డేట్స్ లో పవన్ కళ్యాణ్ ఓజీ, బాలయ్య అఖండ 2 వంటి భారీ చిత్రాలు ఉండటంతో ఎవరికీ ఇబ్బంది లేకుండా డేట్ ను ఫైనల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరికొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది.

రూటు మార్చిన మెగాస్టార్..
70 ఏళ్ల వయస్సులోనూ మెగాస్టార్ వెండితెరపై రఫ్పాడిస్తున్నారు. ఏకంగా యాక్షన్ చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. కాగా లాక్ డౌన్ కు ముందు వరకు సీనియర్ డైరెక్టర్లకు అవకాశం ఇచ్చిన మెగాస్టార్ ప్రస్తుతం మాత్రం యంగ్ డైరెక్టర్స్ తో పని చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే మల్లిడి వశిష్టతో విశ్వంభర, అనిల్ రావిపూడితో మెగా157, ఓదెల శ్రీకాంత్ తో మెగా 158 వంటి చిత్రాల్లో నటిస్తుండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X