చిరంజీవి 150వ చిత్రంగా అదే ఖరారు
చిరంజీవి 150వ చిత్రం గురించి కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందబోయే చిత్రంలో ఆయననటించబోతున్నారని ఫిలింనగర్ తాజా సమాచారం. కడప జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. నాటి తెల్లదొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన త్యాగవీరుడు. ఆయన జీవిత గాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తొలుత ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలను చిరంజీవే చేపట్టాలని భావించారు. దర్శకత్వ బాధ్యతలను వివి.వినాయక్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి-వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఠాగూర్' చిత్రం సంచలన విజయం నమోదుచేసుకున్న విషయం తెల్సిందే. సమకాలీన రాజకీయ అంశాలను ప్రస్దావిస్తూ గతంలో ఎన్.టి.రామారావు హీరోగా వచ్చిన "సర్ధార్ పాపారాయుడు" చిత్రం తరహాలో తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెల్సిందే.
ఇక ఈ చిత్రం రాజకీయంగానూ చిరంజీవికి ప్లస్ కావాలని భావిస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ గెస్ట్ పాత్ర చేయనున్నాడని చెప్తున్నారు.అంతేగాక ఈ చిత్రాన్ని చరణే నిర్మించనున్నారని చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా చిరంజీవి తన 150వ సినిమా కోసం సన్నబడ్డాడు. చిక్కి సన్నబడిన చిరుని చూసి చాలా మంది 10యేళ్ళు వయసు చిరుకు తగ్గినట్టుందని మాట్లాడుకుంటున్నారు. గ్లామర్ గా కనబడటానికి కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. బరువు పెరగకుండా ఉండాలంటే పట్టుదలతో పూర్తిగా మందు కూడా మానేశాడట చిరంజీవి. జిమ్ తో పాటు యోగా కూడా చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫుల్ ఫిట్ గా తయారయ్యి తన 150వ సినిమాలో డ్యాన్స్ లతో పాటు ఫైట్స్ కూడా అదరగొట్టాలని చిరు నిర్ణయించుకున్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











