నిన్నటి హీరోయిన్స్ రాశి,ఇంద్రజ ఇద్దరూ రాజకీయాల్లో కి వచ్చి మహిళా వింగ్స్ ని ఉద్దరించాలని ఆత్రుతపడుతున్నట్లు సమాచారం. ఆ అవకాశం కోసం తమకు పరిచయమున్న చిరంజీవిని వ్యక్తిగతంగా కలిసారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.తమకు పార్టీలో గుర్తింపు కలిగించే విభాగాల్లో ఉంచితే తాము ప్రజారాజ్యం పార్టీలో చేరి ప్రచారం చేస్తూ సేవలందిస్తామని ప్రపోజల్ పెట్టారు. అయితే చిరంజీవి ముందు చూపుతో మహిళా విభాగం అధ్యక్ష్యురాలిగా ఎవరినీ అనుకోలేదు. కాబట్టి పార్టీలో చేరి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే తప్పని సరిగా మీ సేవల్ని గుర్తించి తగిన అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని చెప్తున్నారు. అయితే రాశి,ఇంద్ర తమ నిర్ణయాన్ని త్వరలోనే చెప్తామని వచ్చేసారని తెలుస్తోంది.