twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చింతచచ్చినా పులుపుచావదు అందుకు నిదర్శనం చిరంజీవే...

    By Sindhu
    |

    చింత చచ్చినా పులుపు చావలేదని గత ప్రజారాజ్యం పార్టీ అధినేత, ప్రస్తుత కాంగ్రెసు నేత మెగాస్టార్ చిరంజీవి ప్రకటన తెలియజేస్తోంది. ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతోనే ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించారనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన అది నిజం కాదని అనవచ్చు కాక, అదే నిజమని ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతోనే ఆయన కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారని కూడా అనుకోవడంలో తప్పు లేదు. తన బలాన్ని కాంగ్రెసుకు దారాదత్తం చేయడం ద్వారా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారని అనుకోవచ్చు.

    ముఖ్యమంత్రిపై ఆశలు పెట్టుకున్న చిరంజీవి సినీ రంగంలోకి తిరిగి అడుగుపెట్టబోనని శపథం చేశారు. చిన్న చితకా పాత్రలు చేయడానికి మనస్సు రాక ఆయన సినీ రంగానికి దూరంగానే ఉంటున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి పాత్ర వస్తే చేస్తారా అని అడిగితే నిజ జీవితంలోనే ముఖ్యమంత్రిగా జీవించే అవకాశం వస్తుంటే సినిమాల్లో ముఖ్యమంత్రిగా నటించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ మాట విన్న జర్నలిస్టులు నిజంగానే ఆశ్చర్యపోయి ఉంటారు. కాంగ్రెసులో ముఖ్యమంత్రి పీఠం చిరంజీవి అనుకున్నంత సులుభంగా చేతికి అందుతుందా అనేది వారి ఆశ్చర్యానికి కారణం. ఈ విషయం కూడా తెలియని చిరంజీవి ఆశల పల్లకీలో ఊరేగుతున్నారని అనిపించక మానదు.

    English summary
    Chiranjeevi today once and for all cleared for his fans his thoughts on doing movies. He made it clear that he has absolutely no intention of doing movies any more.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X