చిరంజీవి తమ ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో గత కొంత కాలంగా ఊపిరి సలపనంత బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ లేనంత ఆందోళన, అలసటకు గురి అవటం గ్లామర్ దెబ్బతినటం జరిగింది. దాంతో రెండవ విడత ఎలక్షన్స్ ముగియగానే రిలాక్స్ అవ్వాలని నిర్ణయించుకుని సమాచారం. కాస్త రిప్రెష్ అయితే ఎప్పటిలా తిరిగి తన గ్లామర్ తిరిగి వస్తుందని, మానసికి విశ్రాంతి సైతం లభిస్తుందని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకోసం ఆయన కుటుంబ సమేతంగా లండన్ వెళ్ళాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాల్లో వినపడుతోంది. అందుకోసం ఏర్పాట్లు కూడా జరిగాయని తెలుస్తోంది. అక్కడికి వెళ్ళితే మీడియా తలనొప్పి తగ్గుతుంది..కాస్త ఈ రాజకీయాలకు దూరంగా ఉండవచ్చునని ఆయన భావిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి తిరిగి వస్తేచాలని ఆయన తన వాళ్ళతో చెప్పారని వినిపిస్తోంది. అయితే అల్లు అరవింద్ ఈ విషయంపై తన నిర్ణయం చెప్పకపోవంటంతో కాస్త కన్ఫర్మేషన్ కే ఆలస్యమయ్యేటట్లు ఉంది.
Story first published: Thursday, April 23, 2009, 17:01 [IST]