For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు ఇన్వాల్వ్ మెంట్ తో రామ్ చరణ్ ‘రచ్చ’రచ్చే...!

    By Sindhu
    |

    రామ్ చరణ్ తాజాగా కమిట్ అయిన కొత్త చిత్రం 'రచ్చ". ఈ సినిమాకి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ లో స్ట్రైక్ జరిగినందువల్ల ఈ సినిమా ప్రారంభోత్సవం వచ్చే నెలకి వాయిదా పడింది. మే మొదటి వారంలోనే ఈ చిత్రం ఆరంభమవుతుందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి పూర్తిగా చిరంజీవి ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాడట.

    స్ర్కిప్ట్, సంగీతం..ఇలా ప్రతి డిపార్ట్ మెంట్ లోనూ చిరు ఎంటరయ్యి చరణ్ కు సంబంధించిన ప్రతి విషయం దగ్గరుండి చూసుకోవాలనుకుంటున్నాడట చిరంజీవి. గతంలో తను నటించిన 'ఇంద్ర", 'ఠాగూర్", 'స్టాలిన్" సినిమాల్లో చిరు ఇన్వాల్వ్ మెంట్ పూర్తిగా ఉంది. కాబట్టే ఆ సినిమాలు ఎంత సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు కొడుకు సినిమా విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి చరణ్ తదుపరి చిత్రానికి సూపర్ డూపర్ హిట్ కొట్టేలా చూసుకోవాలని చిరు గట్టిగా నిర్ణయించుకున్నాడని సమాచారం..

    English summary
    Chiranjeevi is planning to involve himself in all departments of Ramcharan’s next project Rachcha, to make sure that it would be a definite hit. Industry folks who have seen chiru’s involvement for his own movies like Indra, Tagore and then Chirutha say that , if he puts his heart into work, the movie will surely turn into a blockbuster hit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X