‘నాయక్’లో...చిరంజీవి, జూ ఎన్టీఆర్! నిజమేనా?
హైదరాబాద్ : ఒకప్పుడు టాప్ పొజిషన్లో కొనసాగిన దర్శకుడు వివి వినాయక్ ఇప్పుడు చాలా వెనక బడిపోయాడు. గత సంవత్సరం వచ్చిన 'బద్రీనాథ్' అట్టర్ ప్లాప్ కావడం, ఆయ నుంచి హిట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు దాటిపోవడమే ఇందుకు కారణం. దీంతో తన తాజా సిసిమా 'నాయక్'ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వినాయక్ ఈ చిత్రాని భారీ హిట్ చేసేందుకు వీలైనన్ని దారులు వెతుకుతున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిత్రం కాబట్టి సినిమా ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి. అయితే సినిమాకు కలెక్షన్లు రికార్డు స్థాయిలో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈచిత్రంలో మెగాస్టార్ నటించిన సూపర్ హిట్ పాటలను రీమిక్స్ చేసారు. తాజాగా అందిన సమాచారాన్ని బట్టి ఈ చిత్రంలో మెగా స్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్‌లలతో ఇందులో గెస్ట్ రోల్ చేస్తున్నాడట వినాయక్.
జూ ఎన్టీఆర్ వినాయక్‌కు చాలా క్లోజ్. పైగా రామ్ చరణ్‌కు స్నేహితుడు కూడా. ఈనేపథ్యంలో గెస్ట్ రోల్ చేయడానికి ఒప్పుకున్నాడట యంగ్ టైగర్. అదే విధంగా చిరంజీవి గెస్ట్ అప్పియరెన్స్ మగధీర సినిమాలో మాదిరి 'నాయక్' చిత్రానికి కూడా బాగా కలిసొస్తుందని వినాయక్ నమ్ముతున్నాడు. వీరిద్దరి గెస్ట్ అప్పియరెన్స్ నిజమైతే సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉంటాయి.
రామ్ చరణ్ సరసన కాజల్, అమలా పాల్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్నా' అనే గీతాన్ని రీమిక్స్ చేశారు. రామ్‌చరణ్, అమలాపాల్‌లపై ఈ గీతాన్ని తెరకెక్కించారు. జనవరి 9న సినిమా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు. ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: ఆనంద్ సాయి. సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం : తమన్.


Click it and Unblock the Notifications











