నాగ్,చిరుల మధ్య విభేధమా?

చిరంజీవి పార్టీ ఆఫీసు అన్నపూర్ణ స్టూడియో ఏడెకరాలకి అతి సమీపంలో మెయిన్ రోడ్డుపై ఉంది. ఆ ఆఫీసుకు వచ్చే వేలాది అభిమానులు,పార్టీ కార్యకర్తలుకి పార్కింగ్ సమస్య వస్తోంది. దాంతో తరుచుగా ట్రాఫిక్ జామ్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకని చిరంజీవి అన్నపూర్ణలో కొంత స్ధలం పార్కింగ్ కి ఇవ్వమని నాగార్జునని అడిగారని సమాచారం. అయితే నాగార్జున మొదట సరేనన్నా తర్వాత కాదన్నాడని చెప్తున్నారు. కారణంగా తన తండ్రి నిర్ణయంగా చెప్పుకొస్తున్నాడని అంటున్నారు.
కారణంగా ఈ మధ్య నాగార్జున కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అవుతాననే భయమేనంటున్నారు. అందులోనూ ఆ మధ్య కాంగ్రెస్ కు అనుకూలంగా యాడ్స్ చేయటం జరిగింది. అందుకు ప్రతిగా పాలక పక్షం నుండి స్టూడియో డవలప్ మెంట్ కి కావాల్సిన కొన్ని ఫర్మిషన్స్ పొందుతున్నారనేది వినపడుతోంది. దాంతో ఇప్పుడు స్నేహం కోసం ఒక అడుగు ముందుకేసి ప్రజారాజ్యం పార్టీకోసం స్ధలం కేటాయిస్తే కాంగ్రెస్ నుండి ఏం ఇబ్బంది ఎదురౌతుందోననే అలా చెప్పాడంటున్నారు. అయితే ఈ చిన్న సంఘటనను చిరు కూడా లైట్ గా తీసుకున్నాడని విషయం అర్ధం చేసుకున్నాడని చెప్తున్నారు. ఏది నిజం,ఏది అబద్దం అయినా ఇద్దరు మిత్రులు మాత్రం ఇలా రాజకీయంకోసం విడిపోయే స్ధితి రాకూడదని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











