twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉద్దరించడం మాని..సంపాదన మీద పడ్డ చిరు?

    By Bojja Kumar
    |

    రోజు రోజుకు చిరంజీవిలో సేవా భావం తగ్గుతుందా? ఇక జనాన్ని ఉద్దరించింది చాలు, సంపాద మీద పడదాం అనే దిశగా ఆయన ఆలోచిస్తున్నారా? అంటే అవును అంటూ సమాధానం వినిపిస్తున్నారు ఆయన అభిమానులు. చిరంజీవి గతంలో మాదిరి లేడని, ఇప్పడు ఆయన చాలా మారిపోయి పూర్తి కమర్షియల్ గా మారాడనే గుసగుసలు వినిపస్తున్నాయి. వాళ్ల అనుమానాలకు బలం చేకూరేలా ఇటీవల కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటుండటం గమనార్హం.

    వెండి తెరపై హీరోగా వెలుగొందుతున్న సమయంలో చిరంజీవి...బ్లడ్ బ్యాంకు, సామాజిక సేవ పేరుతో అనేక కార్య్రకమాలు నిర్వహించేశారు. అప్పడు ఆయనకు మంచి పేరు కూడా ఉంది. ఇదే ఊపుతో రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నించిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చేతి చమురు బాగానే వదిలించుకున్నారు. దీంతో చిరంజీవి ఆస్తులు చాలా వరకు కరిగి పోయాయనే వాదన కూడా లేక పోలేదు.

    మరోవైపు చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత టిక్కెట్లు అమ్ముకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను అప్పు డు చాలా మంది నమ్మ లేదు. కానీ ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు చిరు పేల్చిన డైలాగులు తారుమారు చేస్తూ ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి తాను అందులో కలిసి పోయారు. ఈ నేపథ్యంలో చిరంజీవి కాంగ్రెస్ కు అమ్ముడు పోయాడనే వార్తలు కూడా వనిపించాయి. ఇందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే...

    ప్రస్తుతం చిరంజీవి సామాజిక, సేవా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఓన్లీ కమర్షియల్ కార్య్రకమాలపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. ఆ మధ్య ఓ కార్పొరేట్ టీవీ ఛానల్ ఓపెనింగుకు హాజరైన చిరంజీవి, ఇటీవల పలు ప్రైవేట్ షోరూం ఓపెనింగుల్లో పాల్గొన్నాడు. ఇలా హాజరైన చిరుకు బాగానే గిట్టుబాటైనట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో స్వాతంత్ర దినోత్సవం లాంటి పర్వదినాల్లోః మెగాస్టార్ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టక పోవడం, అసలు సామాజిక కార్యక్రమాల జోలికే వెళ్లకుండా దూరంగా ఉండటం బట్టి చూస్తేచిరంజీవి జనాలను ఉద్దరించడం మాని, తనను తాను ఉద్ధరించుకునేందుకు సంపాదన మీద పడ్డాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి చిరంజీవి ఇలాంటి వార్తలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

    English summary
    Day-by-day Mega Star Chiranjeevi is not only loosing his fan base but he is also hitting directly on their trust. Earlier people used to strike off gossips like 'Chiru selling party tickets' and now they are changing perception
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X