'గబ్బర్ సింగ్' ఆడియో ఛీఫ్ గెస్ట్ లు వాళ్లే
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'గబ్బర్ సింగ్' ఆడియో ఈ నెల ఈ నెల 15న హైదరాబాద్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్ కి చిరంజీవి,ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ ఛీఫ్ గెస్ట్ లుగా హాజరవుతున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ రచ్చ ఆడియో ఫంక్షన్ కి పవన్ రాకపోవటంతో వచ్చిన అనుమానులను ఈ ఫంక్షన్ కి చిరంజీవి, రామ్ చరణ్ హాజరవటంతో తీర్చనున్నారని తెలుస్తోంది. శిల్పకళా వేదికలో జరుగుతున్న ఈ ఆడియో పంక్షన్ లో బాబా సెహగల్ తన సంగీతం తో అలరించనున్నారు.
ఇక ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరక్ట్ చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ ఆడియో విషయాన్ని నిర్మాత గణేశ్ వెల్లడిస్తూ 'మా సినిమా మీద అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వాటికి తగ్గట్లుగా చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది. పవన్‌కళ్యాణ్‌గారి కెరీర్‌లోనే నెంబర్‌వన్ హిట్‌గా నిలవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకం ఉంది. ఇటువంటి సినిమా తీసే అవకాశం ఇచ్చిన మా హీరోగారికి కృతజ్ఞతలు. దర్శకుడు హరీశ్‌శంకర్ సినిమాని బాగా తీశారు. ఈ నెల 15న ఆడియోని, మేలో సినిమాని విడుదల చేస్తాం' అన్నారు.
సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ దబాంగ్ రీమేక్ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కాస్త తిక్క ఉన్న పోలీస్ అధికారిగా కనపించనున్నారు. శృతిహాసన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా,సింగిల్ లైన్ పంచ్ లతో ఈ చిత్రం రూపొందుతోంది. దబాంగ్ లో కొన్ని మార్పులు చేసి గబ్బర్ సింగ్ లో పవన్ మోసుకుపోయే సింగిల్ మ్యాన్ షో గా తీస్తున్నారు. పవన్ అభిమానులను ఈ చిత్రం పూర్తి స్ధాయిలో అలరించనుందని భావిస్తున్నారు.
శ్రుతిహాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: శివబాబు.


Click it and Unblock the Notifications











