మా ఆయన బంగారమంటున్న చిరంజీవి భార్య సురేఖ
మా ఆయన బంగారం, అందగాడు అంటోంది ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ. చిరంజీవితో కలిసి ఆమె సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా ఆయన బాగుంటాడని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. మా ఆయన స్టయిలిష్ గా ఉంటాడని కూడా ఆమె చెప్పారు. తమ కుమారుడు రామ్ చరణ్ తేజా నటించిన ఆరెంజ్ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి కల్లా తాను నటిస్తున్న 150వ చిత్రం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిరంజీవి చెప్పారు. కథ ఫైనలైజ్ కాకుండా ఆర్టిస్టుల వివరాలు చెప్పలేమని ఆయన అన్నారు. ప్రేక్షకులు తనను నుంచి ఏ విధమైన సినిమాను కోరుకుంటారో, అదే విధంగా సినిమా రూపుదిద్దుకుంటుందని ఆయన చెప్పారు. సినిమాలో అన్ని సరకులూ, మసాలాలు ఉంటాయని ఆయన చెప్పారు. తనపై తన భార్య చేసిన వ్యాఖ్యకు ఆయన సంతోషంగా ప్రతిస్పందించారు.


Click it and Unblock the Notifications











