అల్లు అర్జున్‌కు విలన్‌గా కోలీవుడ్ టాప్ హీరో: విజయ్ సేతుపతి స్థానంలో ఊహించని స్టార్

చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. బడా ఫ్యామిలీకి చెందిన వాడే అయినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇక, చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతిని తీసుకున్నా.. అతడు అనివార్య కారణాలతో తప్పుకున్నాడు. దీంతో ఆయన స్థానంలో మరో కోలీవుడ్ స్టార్ హీరోను తీసుకున్నారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

అల ఇండస్ట్రీ హిట్ కొట్టేసిన అల్లు అర్జున్

అల ఇండస్ట్రీ హిట్ కొట్టేసిన అల్లు అర్జున్

‘నా పేరు సూర్య' తర్వాత చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్నాడు అల్లు అర్జున్. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ‘అల.. వైకుంఠపురములో' అనే సినిమా చేశాడు. ఎన్నో అంచనాల నడుమ గత సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీంతో ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి.

సుదీర్ఘ విరామం తర్వాత ఆ దర్శకుడితో

సుదీర్ఘ విరామం తర్వాత ఆ దర్శకుడితో

‘ఆర్య', ‘ఆర్య 2' తర్వాత సుకుమార్‌తో మరోసారి జత కట్టాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘పుష్ప' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మొత్తం ఐదు భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచాలున్నాయి.

ఊరమాస్ పుష్పరాజ్‌‌గా స్టైలిష్ స్టార్ హీరో

ఊరమాస్ పుష్పరాజ్‌‌గా స్టైలిష్ స్టార్ హీరో

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘పుష్ప'లో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌గా కనిపించనున్నాడు. ఇందుకోసం అతడు ఊరమాస్ మేకోవర్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన లుక్‌ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాలో అతడు చిత్తూరు యాసలో మాట్లాడడనున్నాడు. అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్న విషయం తెలిసిందే.

 స్టార్ హీరో అవుట్... ఊహించని కష్టాలు

స్టార్ హీరో అవుట్... ఊహించని కష్టాలు

ఐదు భాషల్లో రూపొందుతోన్న ‘పుష్ప'లో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో అత్యంత ప్రాధాన్యం ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ రోల్ కోసం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని తీసుకున్నారు. కానీ, అనివార్య కారణాలతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నాడు. అప్పటి నుంచి ఈ పాత్ర కోసం అన్వేషణ సాగుతూనే ఉంది.

బన్నీకి విలన్‌గా కోలీవుడ్ సీనియర్ హీరో

బన్నీకి విలన్‌గా కోలీవుడ్ సీనియర్ హీరో

వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో అది కాస్తా వాయిదా పడింది. దీంతో విజయ్ సేతుపతి డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ పాత్ర కోసం చాలా మంది పేర్లను పరిశీలించింది అల్లు అర్జున్ అండ్ కో. ఈ నేపథ్యంలో తాజాగా కోలీవుడ్ టాప్ హీరోను ఈ పాత్ర కోసం తీసుకున్నట్లు ఓ న్యూస్ లీకైంది.

విజయ్ సేతుపతి స్థానంలో ఊహించని స్టార్

విజయ్ సేతుపతి స్థానంలో ఊహించని స్టార్

తమిళంతో పాటు దక్షిణాది భాషలన్నింటిలోనూ సినిమాలు చేసి స్టార్ హీరోగా వెలుగొందుతోన్న చియాన్ విక్రమ్ ‘పుష్ప'లో విలన్‌గా నటిస్తున్నాడని ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. దక్షిణాదితో పాటు హిందీ ప్రేక్షకులకు పరిచయం ఉన్న కారణంగానే ఆయనను తీసుకున్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X