60 ఏళ్ల వయసులో స్టార్ హీరోకి సర్జరీ? 25 ఏళ్ల లుక్ కోసం అలాంటి రిస్క్!
సినీ తారలు అందం కోసం ఎంత తాపత్రయపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలు, హీరోయిన్లే కాదు.. చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు కూడా ఇందుకోసం ఎంతో కష్టపడతారు. ఇష్టమైన పదార్ధాలు తినకుండా నోరు కట్టేసుకోవడంతో పాటు కఠినమైన వ్యాయామాలు, వర్కవుట్స్, ఖరీదైన ఆహారం తీసుకోవడం చేస్తుంటారు. మరికొందరైతే వైద్య శాస్త్రంలో అందుబాటులో ఉన్న రకరకాల చికిత్సలు, సర్జీలు చేయించుకుంటూ అందాన్ని కాపాడుకుంటారు. తాజాగా ఓ స్టార్ హీరో 60 ఏళ్ల వయసులో సర్జరీ చేయించుకున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
సినిమా కోసం అందులోని పాత్ర కోసం కష్టపడి తమను తాము మార్చుకునే అరుదైన నటులు కొందరే ఉంటారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, మోహన్‌లాల్ లాంటి వారు సినిమా కోసం తమ శరీరాన్ని పాత్రకు తగినట్లుగా మలచుకుంటారు. గంటల కొద్దీ మేకప్‌కి కేటాయించడంతో పాటు పర్ఫెక్షన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని వీళ్లు నిరూపించారు. ఈ కోవలోకే వస్తారు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్. రోటీన్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ప్రయోగాలకు పెద్ద పీట వేస్తారు విక్రమ్. వైవిధ్యమైన పాత్రలలో విభిన్న గెటప్స్‌లో కనిపించడం కోసం విక్రమ్ ఎంతో శ్రమిస్తారు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు కొత్తదనాన్ని ఇవ్వాలని ఎంతో కష్టపడతారు.

కెరీర్ తొలినాళ్ల నుంచి తీసుకుంటే.. శివపుత్రుడు, అపరిచితుడు, కోబ్రా, ఐ, తంగలాన్ తదితర చిత్రాలలో విక్రమ్ వేసిన గెటప్స్.. అందుకోసం ఆయన పడిన కష్టం ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. కోబ్రా అనే సినిమా కోసం విక్రమ్ 7 విభిన్న గెటప్స్‌లో కనిపించి ప్రేక్షుకులను అలరించారు. ఆయన నటిస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. తంగలాన్, వీర ధీర సూర నిరాశపరిచాయి. త్వరలో మూడు సినిమాలు చేస్తున్నట్లు విక్రమ్ ప్రకటించారు. అయితే వీటి వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇదే సమయంలో తన అభిమానులకు విక్రమ్ శుభవార్త చెప్పారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ధృవ నక్షత్రం మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రావాల్సిన ఈ సినిమా పదేళ్ల క్రితమే విడుదల కావాల్సి ఉంది. అయితే సినిమా సెట్స్ మీదకి వెళ్లిన నాటి నుంచి అనేక సమస్యలతో వాయిదా పడుతూ వచ్చింది. చివరికి వ్యవహారం మద్రాస్ హైకోర్టుకు చేరగా ఇటీవలే ధర్మాసనం విచారణ పూర్తి చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ధృవ నక్షత్రం మూవీని రిలీజ్ చేసేందుకు ఇన్వెస్టర్స్ ఒప్పుకున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన లాభాలను పెట్టుబడిదారులు పంచుకునేలా ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది. దాంతో ధృవ నక్షత్రం రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
ఇదిలాఉండగా.. చియాన్ విక్రమ్ వయసు ప్రస్తుతం 60 ఏళ్లు అయినప్పటికీ కుర్రాళ్లకు ఏమాత్రం తగ్గని లుక్‌లో మెరిసిపోతున్నారు. ఇటీవల ఓ రెస్టారెంట్ బయట బ్రేక్‌ఫాస్ట్ చేస్తోన్న విక్రమ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మునుపటి కంటే యంగ్‌గా.. ఒత్తైన జుట్టుతో, ఫ్రెష్‌గా దర్శనమిస్తుండటంతో ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్‌పై చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఆరు పదుల వయసులోనూ అలా కనిపించడానికి విక్రమ్ ఓ సర్జరీ చేయించుకున్నట్లుగా ఫిలింనగర్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. విదేశాల్లో ఆయన అత్యాధునిక కాస్మోటిక్ ట్రీట్‌మెంట్‌లు చేయించుకోవడం వల్లే ఆ మార్పు వచ్చిందని చెబుతుండగా.. మరికొందరు మాత్రం ప్రకృతి వైద్యం, ఆరోగ్యకరమైన అలవాట్ల వల్ల ఈ మార్పు వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. అధికారికంగా విక్రమ్ సర్జరీకి సంబంధించిన ఎలాంటి ప్రకటనా వెలువడనప్పటికీ.. చాలామంది మాత్రం కాస్మోటిక్ ప్రోసీజర్‌ల గురించి కామెంట్స్ పెడుతున్నారు. ఈ పుకార్ల నేపథ్యంలో దీనిపై త్వరలోనే విక్రమ్ టీమ్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications