అనూహ్యం: జానీ మాస్టర్‌తో పవన్ సినిమా?.. కానీ ఓ ట్విస్ట్..

Recommended Video

జానీ మాస్టర్‌తో పవన్ సినిమా? కానీ ఓ ట్విస్ట్..!

పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తున్నాడన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగాడు. రాజకీయాల్లో క్రియాశీలకంగా మారడంతో.. అందుకోసం సినిమాలను పణంగా పెట్టడం తప్పదని పరోక్షంగా చెప్పేశాడు. పవన్ నుంచి ఇక సినిమాలు రావన్న నిరాశలో అభిమానులు ఉన్నవేళ.. ఓ ఆసక్తికర ఊహాగానం తెరపైకి వచ్చింది..

 విషయమేంటి?:

విషయమేంటి?:

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు పవన్ కల్యాణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాను ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా నిలదొక్కుకోకమునుపే పవన్‌ను కలిసి ఓ కథ కూడా వినిపించారు. అయితే అనుభవలేమి కారణంగా జానీకి అప్పట్లో అవకాశం ఇవ్వలేదు పవన్ కల్యాణ్.

 పవన్ మాటిచ్చాడు కాబట్టే..:

పవన్ మాటిచ్చాడు కాబట్టే..:

అప్పట్లో జానీకి అవకాశం ఇవ్వకపోయినా.. దర్శకత్వంపై పట్టు సంపాదించుకుని వస్తే కచ్చితంగా సినిమా చేస్తానని పవన్ మాట ఇచ్చారట. ఆ తర్వాతి కాలంలో ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా నిలదొక్కుకున్న జానీ మాస్టర్.. అదే సమయంలో దర్శకత్వ ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నారట. అందుకే పవన్‌ను కలిసి ఇటీవలే మరోసారి సినిమా ప్రపోజల్ ఆయన ముందు పెట్టారట.

పవన్-జానీ సినిమా సాధ్యమేనా?

పవన్-జానీ సినిమా సాధ్యమేనా?

జానీకి ఇచ్చిన మాట మేరకు తప్పకుండా సినిమా చేస్తానని అన్నారట పవన్ కల్యాణ్. అయితే ఇందులో పవన్ కల్యాణే హీరోగా నటిస్తారా? అంటే దాదాపు అసాధ్యమే. దానికి తోడు ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలతో పవన్ కమిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి.

వీటన్నింటిని పక్కనపెడితే.. కొండగట్టు యాత్రలో భాగంగా సినిమాల ఆలోచన లేదంటూ ఆయన ప్రకటించిన నేపథ్యంలో జానీతో సినిమా పట్టాలెక్కుతుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

పవన్ ఏమన్నారు?:

పవన్ ఏమన్నారు?:

కొండగట్టు నుంచి 'ఛలో రే ఛల్' యాత్ర ప్రారంభించిన సందర్భంగా సినిమాల గురించి కూడా మాట్లాడారు పవన్ కల్యాణ్. ఓ జర్నలిస్టు ప్రశ్నకు బదులిస్తూ.. సినిమా ఆలోచనల్ని ఇక పక్కన పెట్టేస్తున్నట్లు సమాధానమిచ్చారు. దీంతో అజ్ఞాతవాసి సినిమానే ఇక పవన్ చివరి సినిమా అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు.

 సినిమా ఉండొచ్చు.. కానీ:

సినిమా ఉండొచ్చు.. కానీ:

సినిమా ఆలోచన లేదని పవన్ ప్రకటించగా.. హీరోగా మాత్రమే ఆయన సినిమాలు చేయరని, నిర్మాణ సంస్థ మాత్రం కొనసాగుతుందని తెలుస్తోంది. కాబట్టి జానీ మాస్టర్ కు తన నిర్మాణ సంస్థలో అవకాశమిచ్చి వేరే హీరోతో సినిమా చేయిస్తారన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఈ ఊహాగానాలన్ని కేవలం ప్రచారానికే పరిమితమవుతాయో.. లేక సినిమా రూపం దాలుస్తాయో ఇప్పట్లో చెప్పడం కష్టమే.

More from Filmibeat

Read more about: pawan kalyan jaani tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X