ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు మరో కొత్త టైటిల్: ‘నాయుడు’ సెంటిమెంట్‌పై కన్నేశారుగా!

కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నందమూరి హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' నుంచి ఏకంగా ఐదు సూపర్ హిట్లను అందుకున్న అతడు.. ఒక సినిమా పట్టాలపై ఉండగానే మరో దానిని లైన్‌లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ కాకుండా సరికొత్త పేరును పెడుతున్నట్లు తాజాగా ఓ వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా టైటిల్? పూర్తి వివరాలు మీకోసం!

మెగా హీరోతో కలిసి.. ఇండస్ట్రీపై దండయాత్ర

మెగా హీరోతో కలిసి.. ఇండస్ట్రీపై దండయాత్ర


వరుస విజయాలతో దూసుకుపోతోన్న ఎన్టీఆర్.. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRRలో చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో తారక్.. భీంగా, చరణ్.. అల్లూరిగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన హీరోల ఇంట్రడక్షణ్ టీజర్లు ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేశాయి.

హిట్ కాంబో రిపీట్ చేయనున్న యంగ్ టైగర్

హిట్ కాంబో రిపీట్ చేయనున్న యంగ్ టైగర్

RRR పట్టాలపై ఉండగానే తన ఫ్యూచర్ ప్రాజెక్టులను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలోనే 'అరవింద సమేత' వంటి భారీ హిట్ తర్వాత మరోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిశాడతడు. రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడిన విషయం తెలిసిందే.

అదే సెంటిమెంట్‌తో టైటిల్ ఫిక్స్ చేసేశాడని

అదే సెంటిమెంట్‌తో టైటిల్ ఫిక్స్ చేసేశాడని

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రానికి 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పెడుతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇందులో ఎన్టీఆర్‌ను రాజకీయ నేపథ్యం ఉన్న కుర్రాడిగా చూపించబోతున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. పొలిటికల్ స్క్రిప్ట్ కాబట్టే హస్తినతో ముడి పెడుతూ ఈ సినిమాకు టైటిల్‌ను పెట్టినట్లు ప్రచారం జరిగింది.

దాన్ని మార్చి.. మరో టైటిల్ పెట్టారని టాక్

దాన్ని మార్చి.. మరో టైటిల్ పెట్టారని టాక్


త్రివిక్రమ్ సినిమా టైటిళ్లలో 'అ' సెంటిమెంట్‌ను ఫాలో అవుతారు. అందుకోసమే 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే పేరును ఎన్టీఆర్ మూవీ కోసం రిజిస్టర్ చేయించారన్న టాక్ వినిపించింది. అయితే, ఇటీవల ఎన్టీఆర్ సినిమాకు 'రాజా వచ్చినాడు' అనే పేరు ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఈ టైటిల్ కోసం గురూజీ తన సెంటిమెంట్‌ను పక్కన పెట్టేశాడని అన్నారు.

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా వివరాలు ఇవే

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా వివరాలు ఇవే


ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న ఈ సినిమాను జనవరి 14న అధికారికంగా ప్రారంభించబోతున్నారట. నిర్మాణ సంస్థ కార్యాలయంలో జరిగే పూజా కార్యక్రమాలతో ఈ మూవీ మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మూవీ షూటింగ్ మాత్రం RRR పూర్తయిన తర్వాతనే ప్రారంభం అవుతుందని అంటున్నారు. ఇక, ఇందులో రష్మిక హీరోయిన్‌గా ఫిక్స్ అయిందని టాక్.

‘నాయుడు’ సెంటిమెంట్‌పై కన్నేసిన తారక్

‘నాయుడు’ సెంటిమెంట్‌పై కన్నేసిన తారక్


తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమాకు సరికొత్తగా 'చౌడప్ప నాయుడు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట. కథకు కరెక్టుగా సూటయ్యే పేరు కావడంతో, చిత్ర నిర్మాతలు దీన్ని ఇప్పటికే ఫిలిం ఛాంబర్‌లో కూడా రిజిస్టర్ చేయించారని తెలిసింది. గతంలో 'నాయుడు' పేరుతో వచ్చిన పలు చిత్రాలు హిట్ అయిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X