Guntur Karam నుంచి మరోకరు ఔట్.. ఒక్కొక్కరుగా బయటకు.. ఈ గొడవలేంటీ గురూజీ!
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టాడు మహేశ్ బాబు. హ్యాండ్సమ్ అండ్ మాస్ హీరోగా అతి తక్కువ కాలంలోనే విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నాడు. తనదైన స్టైల్ లో మూవీస్ చేస్తూ సుధీర్ఘ కాలంగా సత్తా చాటుతున్నాడు. ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు వంటి సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మహేశ్ బాబు చేతిలో రెండు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటే గుంటూరు కారం. అయితే ఈ సినిమాకు ఆది నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి. తాజాగా మరో
ఫ్యాన్స్ ఫ్రస్టేట్:హారిక హాసినీ క్రియేషన్స్, సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న మహేశ్ బాబు తాజా సినిమా గుంటూరు కారం. ఈ సినిమాకు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఎప్పుడెప్పుడు మహేశ్ సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఏదో ఒక వార్త నిరాశ పరుస్తోంది. దీంతో అభిమానులు తెగ ఫ్రస్టేట్ అవుతున్నారని టాక్.

సజావుగా సాగకుండా:గుంటూరు కారం సినిమాను ఏ సమయంలో మొదలు పెట్టారో కానీ, ఆది నుంచి ఆటంకాలే ఏర్పడుతున్నాయి. ఒక సమయంలో గుంటూరు కారం సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ మొత్తం మార్చి మహేశ్ బాబును ఒప్పించాడని టాక్. తర్వాత సినిమా మొదలైంది కానీ, షూటింగ్ మాత్రం సజావుగా సాగట్లేదు. మూవీకి చాలా బ్రేకులు వచ్చాయి.

3 వారాలు:గుంటూరు కారం సినిమా మొదలైన తర్వాత మహేశ్ బాబు కుటుంబంతో అనేకసార్లు ఫారెన్ టూర్స్ వేశారు. ఇటీవల కొడుకు గౌతమ్ కోసం లండన్ వెళ్లారు. రెండు వారాలకు హైదరాబాద్ కు వస్తారని అన్నారు. తాజాగా భార్య నమ్రత, పిల్లలతో కలిసి ఇవాళ శంషాబాద్ ఎయిర్ పోర్టులో మహేశ్ బాబు కనిపించారట. ఈసారి వెకేషన్ మూడు వారాలు ఉండొచ్చని సమాచారం.
వదిలేసి పోయి:ఇక గుంటూరు కారం సినిమా మొదట్లో సినిమాటోగ్రాఫర్ గా మధిని తీసుకున్నారు. శ్రీమంతుడు, సర్కారు వారి పాట సినిమాలకు పని చేసిన మధి గుంటూరు కారం ఒక షెడ్యూల్ కూడా పూర్తి కాకుండానే వెళ్లిపోయారట. తర్వాత పి.ఎస్ వినోద్ ను తీసుకొచ్చారు త్రివిక్రమ్. ఇప్పుడు ఆయన కూడా సినిమాను మధ్యలేనే వదిలేసి వెళ్లిపోయారట. త్రివిక్రమ్ తో ఆయనకు దాదాపు ఐదేళ్ల వర్క్ రిలేషన్ షిప్ ఉంది.

బలవంతంగా:త్రివిక్రమ్ తో అరవింద సమేత, అల వైకుంఠపురములో, వకీల్ సాబ్ సినిమాలకు కలిసి పని చేశారు పిఎస్ వినోద్. ఇప్పుడు ఆయన వెళ్లిపోడవంతో సినిమాటోగ్రాఫర్ గా రవి. కె. చంద్రన్ ను తీసుకున్నారని టాక్. ఈ సినిమాకు ఫైట్ మాస్టర్ అన్బరివు ఫస్ట్ యాక్షన్స్ సీక్వెన్ తర్వాత వెళ్లిపోవడంతో మొదలైనట్లు తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్స్, స్క్రిప్ట్ ను బలవంతంగా మార్చడంతోనే ఆయన తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.

హీరోయిన్-తమన్ :ఇక మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫిక్స్ చేశారు. కొన్ని సీన్స్ షూట్ తర్వాత ఆమె స్థానంలో శ్రీలీలను తీసుకొచ్చారు. శ్రీలీల ప్లేసులో మీనాక్షి చౌదరికి అవకాశం ఇచ్చారు. పూజాతో ఓ స్పెషల్ సాంగ్ చేయిస్తారని అంటున్నారు. ఇక తమన్ కూడా తీసివేసినట్లు టాక్ రాగా ఆయన మండిపడ్డారు. అయితే ఒక స్టార్ హీరో సినిమాకు ఈ మధ్య కాలంలో ఇలాంటి బ్రేకులు, వార్తలు రాలేదు. దీంతో ఈ బ్రేకులు, వెళ్లిపోవడాలు, గొడవలేంటీ గురూజీ అని త్రివిక్రమ్ ను అనుకుంటున్నారు అభిమానులు.


Click it and Unblock the Notifications











