Devara : ఆ 15 నిమిషాలు ఊచకోతే.. దేవర ఇంటర్వెల్ సీన్ లీక్ చేసిన సినిమాటోగ్రాఫర్!
కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ , జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ నటించిన మూవీ దేవర. ఈ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. యువసుధ ఆర్ట్స్, ఎన్‌టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీలో దేవరపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో దేవర నుంచి ఓ సీన్ లీకైంది.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో దేవర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేయగా.. అది కాస్తా ఫ్యాన్స్ ఓవరాక్షన్ కారణంగా మిస్ ఫైర్ అయ్యింది. సెప్టెంబర్ 22న ఈ ఈవెంట్‌కు వేదికగా నిలిచిన నోవాటెల్ వద్దకు అభిమానులు పోటెత్తగా.. వారిని నియంత్రించలేక పోలీసులు, నోవాటెల్ సిబ్బంది చేతులెత్తేశారు. ఆడిటోరియం మొత్తం నిండిపోగా.. గెస్టులు కూర్చోనేందుకు కూడా ప్లేస్ లేకుండా పోయింది. ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆడిటోరియంలోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అభిమానులపై లాఠీఛార్జ్ చేసి పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ పరిస్ధితుల్లో కార్యక్రమం నిర్వహించలేమని భావించిన నిర్వాహకులు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేశారు. ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చిన తారక్ అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఎన్టీఆర్ ఓ వీడియో రిలీజ్ చేశారు. కార్యక్రమం జరగకపోవడం విచారకరమని, దేవర గురించి మీకు ఎన్నో విషయాలు చెప్పాలని అనుకున్నానని తారక్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై చూపించే ప్రేమకు రుణపడి ఉంటానని.. అయినా సెప్టెంబర్ 27న థియేటర్‌లో మిమ్మల్ని కలుస్తానని.. కాలర్ ఎగరేసేలా సినిమా ఉంటుందని ఎన్టీఆర్ తెలిపారు. మీరంతా ఇంటికి క్షేమంగా వెళ్లాలని ఆయన వీడియోలో తెలిపారు.
ఇదిలాఉండగా.. పాన్ ఇండియా రేంజ్‌తో తెరకెక్కుతోన్న దేవరలోని కొన్ని సీన్లను ట్రైలర్, టీజర్‌లోనే దర్శకుడు రివీల్ చేసేశాడు. 4 ఫైట్లు, ఇంటర్వెల్ బ్యాంగ్, పాటలు, చిన్న ఎన్టీఆర్ ఎంట్రీ, సెంటిమెంట్ సీన్స్‌పై ముందే హింట్ ఇచ్చేశారు. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు నెక్ట్స్ లెవల్‌లో ఉంటాయని ఎన్టీఆర్ ఇటీవలే చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన రత్నవేలు .. దేవరలోని మరో హైలైట్ సీన్‌ను రివీల్ చేశారు.

ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రత్నవేలు మాట్లాడుతూ.. ఇంటర్వ్యూకు ముందు మూన్ లైట్‌లో రక్తం పారే ఓ మాసీవ్ సీన్ ఉంటుందని చెప్పారు. బ్లడ్ మూన్ షాట్ మామూలుగా ఉండకూడదని, దానిని లో లైట్ డార్క్‌నెస్‌లో షాట్ షూట్ చేశానని రత్నవేలు చెప్పారు. ఇంటర్వెల్‌కు ముందొచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సీన్ ఎడిటింగ్ పూర్తయ్యాక తారక్ చూశారని.. ఆ వెంటనే పీఏని పంపించి తనను పిలిపించారని రత్నవేలు అన్నారు.
Interval కి ముందు ఒక Action Sequences ఉంది అదే Blood Moon Shot దాన్ని Low-light darkness లో తీయాలి, తీసాము ఇంతలో తారక్ అసిస్టెంట్ వచ్చి మిమ్మల్ని పిలుస్తున్నారు అంటే వెళ్తే తారక్ గారు వెంటనే Hug చేసుకోని ఏం తీసారు సార్ షాట్ అని అన్నారు. ~ @RathnaveluDop @tarak9999 #Devara pic.twitter.com/c45ixQbSYM
— NTR Wallpapers (@NTRWallpapers) September 23, 2024
సెట్‌లో కలుస్తాను కదా అనగా.. మేకప్‌కి ముందే మిమ్మల్ని చూడాలని చెప్పారని పీఏ తనతో అన్నాడని తెలిపారు. ఆ షాట్ బాగా డార్క్ మోడ్‌లో ఉండటంతో ఏమైనా నచ్చలేదా అని భయపడుతూనే కేరవాన్‌లోకి వెళ్లగా.. ఎన్టీఆర్ తనను హగ్ చేసుకున్నారని రత్నవేలు చెప్పారు. విజువల్స్ అదిరిపోయాయని, షాట్ బాగా నచ్చిందని ఎన్టీఆర్ మెచ్చుకున్నారని.. ఆ సీన్‌కు థియేటర్‌లు దద్ధరిల్లిపోతాయని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం రత్నవేలు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆ సీన్‌ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని తారక్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











