ఆ దర్శకుడికి ఓకే చెప్పేసిన రామ్ చరణ్.. RRR ఫినిష్ కాగానే! సినీ వర్గాల్లో హాట్ టాపిక్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చాలాకాలంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉండగానే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా ఏదై ఉంటుందనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు విషయమై ఫిలిం నగర్‌లో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా వార్త? వివరాల్లోకి పోతే..

చిరంజీవికి గిఫ్ట్.. రామ్ చరణ్ స్పెషల్ ఫోకస్

చిరంజీవికి గిఫ్ట్.. రామ్ చరణ్ స్పెషల్ ఫోకస్

2019 సంవత్సరం మెగా వారసుడు రామ్ చరణ్ సినిమాల పరంగా అయితే ఏమో గానీ, నిర్మాతగా సత్తా చాటారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా 'సైరా నరసింహా రెడ్డి' సినిమా రూపొందించి తండ్రి చిరంజీవికి కానుకగా ఇచ్చారు. భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా కోసం తన పూర్తి సమయాన్ని కేటాయించిన చెర్రీ.. ఇక తాను హీరోగా నటించే, నటించబోయే సినిమాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారట.

RRR పూర్తికాగానే.. తండ్రి చిరంజీవితో కలిసి

RRR పూర్తికాగానే.. తండ్రి చిరంజీవితో కలిసి

ఇటీవలే మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్' సినిమా రీమేక్‌ హక్కులను సొంతం చేసుకున్న రామ్ చరణ్.. RRR పూర్తికాగానే వెంటనే ఈ సినిమా పనులపై పడనున్నారని వార్తలు విన్నాం. తండ్రి చిరంజీవితో కలిసి ‘లూసిఫర్' సినిమా రీమేక్‌లో నటించాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు వార్తలు షికారు చేశాయి.

క్రేజీ దర్శకుడితో చెర్రీ..

క్రేజీ దర్శకుడితో చెర్రీ..

కానీ తాజా సమాచారం మేరకు.. రామ్ చరణ్ తమిళ క్రేజీ దర్శకుడితో తన తర్వాతి సినిమాను కన్ఫర్మ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రీసెంట్‌గా కార్తితో ‘ఖైదీ' వంటి డిఫరెంట్ మూవీతో ఆకట్టుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట రామ్ చరణ్. RRR పూర్తికాగానే ఈ ప్రాజెక్టు మొదలు కానుందని టాక్.

ఒక్కరు కాదు.. ఇద్దరు దర్శకులు

ఒక్కరు కాదు.. ఇద్దరు దర్శకులు

ఇప్పటికే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.. రామ్ చరణ్‌‌కి ఓ స్టోరీ లైన్ వినిపించగా ఆయన ఓకే అన్నారట. మరోవైపు చెర్రీ.. హరీష్ శంకర్ చెప్పిన ఓ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ రెండు సినిమాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X