ఆ హీరోకు అమ్మాయిలంటే ఇష్టం.. సమంతతో చెప్పించే ప్రయత్నం!
నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా మన్మథుడు 2 మూవీ పోర్చుగల్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. భారీ సెటప్‌తో కొద్దిరోజులుగా నిర్విరామంగా షూటింగ్ నడుస్తున్నది. ఈ సినిమాలో సమంత ఓ కీలక పాత్రలో నటిస్తున్నారనే విషయం సినిమాపై మరింత ఆసక్తి రేపింది. ఇటీవల సమంతకు సంబంధించిన సీన్లను పోర్చుగల్‌లో కంప్లీట్ చేసినట్టు వార్తలు వచ్చాయి.
మన్మథుడు చిత్రంలో నాగార్జునకు అమ్మాయిలంటే ద్వేషం, కోపం అనేది పాయింట్. ఆ సినిమాలో నాగార్జునకు ఎందుకు అయిష్టం అనే పాయింట్‌ను తనికెళ్ల భరణి క్యారెక్టర్ ద్వారా చెప్పించారు. అంతేకాకుండా ఫ్లాష్ బ్యాక్‌లోకి కథను తీసుకెళ్లే బాధ్యతను తనికెళ్లపై పెట్టారు.

ఇక మన్మథుడు 2లో అంతా రివర్స్.. నాగార్జునకు అమ్మాయిలంటే ఇష్టం. చాలా చనువుగా ఉంటాడట. నాగార్జునకు వారంటే ఎందుకు ఇష్టం అనే పాయింట్‌ను మన్మథుడు 2 లో సమంతతో చెప్పించారట. కథలోకి తీసుకెళ్లే పాత్రను సమంత పోషించినట్టు సమాచారం.
నాగార్జునతో సమంత కలిసి నటించడం ఇది మూడోసారి. గతంలో మనం, ఆ తర్వాత రాజుగారి గది 2, ఇప్పుడు మన్మథుడు 2 సినిమాలో కలిసి నటిస్తున్నారు. మామయ్యతో కలిసి సమంత ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాల్సిందే.
మన్మథుడు 2 షూటింగ్ జోష్‌గా సాగుతుండటంతో చిత్ర యూనిట్‌కు నాగార్జున, అమల దంపతులు బ్యాక్‌యార్డ్‌లో బార్బేక్యూ పార్టీని ఏర్పాటు చేశారు. దానికి మంచు లక్ష్మీని కూడా ఆహ్వానించారు. అలాగే పార్టీని ఏర్పాటు చేసినందుకు నాగ్ సర్‌కు థ్యాంక్స్ అంటూ వెన్నెల కిషోర్ ట్వీట్ చేశారు. ఈ ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











