వర్మ హీరోయిన్ల మధ్య సిగపట్లు!?

By Bojja Kumar

ఆడదానికి ఆడదే శత్రువు అనేది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా సినిమా రంగంలో హీరోయిన్ల మధ్య అస్సలు పొసగదనే విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల అనేక సందర్భాల్లో ఒకే సినిమాలో నటించే హీరోయిన్లు కీచులాడుకోవడం తరచూ చూస్తూనే ఉన్నాం. గత కొన్ని రోజుల క్రితం ఓ తమిళ సినిమా షూటింగులో జెనీలియా, హన్సిక గొడవ పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మరువక ముందే రాంగోపాల్ వర్మ తీస్తున్న తాజా బాలీవుడ్ సినిమా 'డిపార్టుమెంట్"లో నటిస్తున్న ఇద్దరు తారల మధ్య విబేధాలు వచ్చాయని ఫిల్మ్ నగర్ సమాచారం. ఆ ఇద్దరు హీరోయిన్ల మన తెలుగు తారలే కావడం గమనార్హం.

డిపార్టుమెంట్ చిత్రంలో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మితో పాటు, మధుశాలిని నటిస్తున్న విషయం తెలిసిందే. లక్ష్మి ఈ సినిమాలో సంజయ్ దత్ తో జతకడుతుండగా, మధుశాలిని గ్యాంగ్ స్టర్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు తమ సత్తా చాటడానికి ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. మరి ఈ పోరులో గెలుపు ఎవరిదో సినిమా విడుదలైతేగానీ తెలీదు. ఇక పోతే ఈ సినిమాలో టాలీవుడ్ హ్యాండ్సమ్ దగ్గుబాటి రాణా పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

సాధారణంగా రాంగోపాల్ వర్మ సినిమాల్లో నటించే వాళ్లు.....వెళితే ఓ రేంజ్ వరకు వెళతారు, లేక పోతే అద:పాతాలానికి పడిపోతారనే వానద ఉంది. మరి ఈ సినిమా ద్వారా మన తెలుగు స్టార్స్ రాణా, లక్ష్మి, మధు శాలినిల భవిష్యత్ ఏమిటో? కాలమే నిర్ణయించాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X