Nagarjuna: ప్రేమించి పెళ్లి చేసుకున్నా... నాగార్జున అమల మధ్య ఆ విషయంలో ఎప్పుడూ గొడవే!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అనగానే చాలా మందికి మొదటగా గుర్తొచ్చేది నాగార్జున - అమలనే. ఈ జోడీకి తెలుగు చిత్రసీమలో ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఈ జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటారు. తమ చర్యలతో ఎంతో మందికి ఆదర్శంగా కూడా నిలిచారు. అయితే ఇంత ప్రేమగా ఉండే వీరిద్దరి మధ్య ఓ విషయంలో మాత్రం అండార్స్టాండింగ్ సరిగ్గా లేదట. పెళ్లై ఇన్నేళ్లైనా అదొక్కటి మాత్రం అలానే ఉండిపోయిందట. అదేంటో తెలుసుకుందాం...
సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు నాగార్జున. ఎన్నో హిట్ సినిమాల్లో తన అద్భుతమైన నటనతో తండ్రి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్నేళ్ల సినీ కెరీర్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుని ప్రస్తుతం అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్నారు.

నాగ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఈయన మొదట 1984లో దగ్గుబాటి వెంకటేశ్ సోదరి లక్ష్మీని పెళ్లి చేసుకున్నారు. అయితే నాగ చైతన్య జన్మించిన తర్వాత ఈ దంపతులు పలు కారణాల వల్ల డివొర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత 1992లో అమలను రెండో పెళ్లి చేసుకున్నారు నాగ్.
అయితే నాగార్జున అమల పెళ్లి చేసుకోకముందు ఇద్దరు కలిసి పలు చిత్రాల్లో నటించారు. మొదటగా డి.రామానాయుడు నిర్మించిన చినబాబు చిత్రంతో అమల టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ సినిమాలోనే నాగార్జునతో కలిసి నటించింది. అనంతరం శివ, ప్రేమ యుద్ధం, హిందీలో రీమేక్ చేసిన శివ, నిర్ణయం చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత అమల సినిమాలకు దూరమైంది. చాలా కాలం తర్వాత 2012లో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అనే చిత్రంలో నటించింది. ఆ మధ్య ఒకే ఒక జీవితం సినిమాలోనూ మెరిసింది.

అయితే నాగ్ - అమల జంట ఎంతో అన్యోన్యంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ ఓ విషయంలో మాత్రం అండర్స్టాండింగ్ ఉండదట. అదేంటంటే నాగ్ డబ్బులు ఎక్కువ ఖర్చుపెడతారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంటుంది. ఈ విషయంలో అమల మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందని అందులో రాసి ఉంది. అందుకే ఈ డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఇద్దరి మధ్య చిన్న చిన్న మాములు గొడవలు జరుగుతాయట.
ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టాలి అని నాగ్ డెసిషన్ తీసుకుని చేస్తుంటే, ఉన్న బిజినెస్‌లు చాలు అని కూడా అమల అంటూ ఉంటుందట. అలా ఈ ఒక్క విషయంలో ఇద్దరి మధ్య సరిగ్గా అండర్స్టాండింగ్ ఉండదని కథనాలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతనిజం ఉందో తెలియదు కానీ..ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ తో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. ఇది వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











