షాకింగ్: పెళ్లి వద్దు కానీ ఎంజాయ్ చేద్దాం.. పవన్ హీరోయిన్‌కు హ్యాండిచ్చిన స్టార్ హీరో

ఇండియాలోని మిగిలిన చిత్ర పరిశ్రమలతో పోల్చుకుంటే బాలీవుడ్‌లో లవ్ ట్రాకులు అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అక్కడి వాళ్లకు డేటింగ్‌లు, బ్రేకప్‌లు అనేవి చాలా సాధారణమైన విషయాలే అని చెప్పాలి. ఇప్పుడు కూడా బీ టౌన్‌లో ఎన్నో జంటలు సందడి చేస్తున్నాయి.

అందులో మలైకా అరోరా.. అర్జున్ కపూర్‌ జోడీ మాత్రం చాలా కాలంగా హైలైట్ అవుతూనే ఉంది. ఎన్నో ఏళ్లుగా వీళ్ల పెళ్లి వార్తలు కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి మధ్య ఇప్పుడు విభేదాలు వచ్చినట్లు న్యూస్ లీకైంది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!

 Clashes Between Malaika Arora and Arjun Kapoor News Goes Hot Topic In Bollywood

మలైకా అలా.. అర్జున్ ఇలా: మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన మలైకా అరోరా నటిగా గుర్తింపును తెచ్చుకోలేదు. కానీ, 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్‌ హుయే' వంటి స్పెషల్ సాంగ్స్‌తో పాపులర్ అయింది. ఇక, బోనీ కపూర్ కొడుకుగా పరిచయం అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అర్జున్ కపూర్. ఈ క్రమంలోనే ఎన్నో హిట్లతో స్టార్‌ అయ్యాడు.

 Clashes Between Malaika Arora and Arjun Kapoor News Goes Hot Topic In Bollywood

ఫస్ట్ సీక్రెట్‌గా.. ఇప్పుడేమో: సుదీర్ఘ కాలంగా అర్జున్ కపూర్.. మలైకా అరోరా ప్రేమాయణం సాగిస్తున్నారు. మొదట్లో చాలా రహస్యంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీళ్లిద్దరూ.. ఎన్నోసార్లు జంటగా కెమెరాలకు చిక్కారు. ఆ తర్వాత ఇది పెద్ద హాట్ టాపిక్ అవడంతో ఈ విషయాన్ని వాళ్లే బహిరంగంగానే ఒప్పుకున్నారు. అర్జున్ ఈ విషయాన్ని ఓ షోలోనే ప్రకటించాడు. మలైకా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

 Clashes Between Malaika Arora and Arjun Kapoor News Goes Hot Topic In Bollywood

12ఏళ్ల తేడా ఉన్నా తగ్గట్లే: సినీ జంట అర్జున్ కపూర్.. మలైకా అరోరాతో డేటింగ్ చేసే విషయం దేశ వ్యాప్తంగా హైలైట్ అవడానికి కారణం.. వీళ్లిద్దరికీ ఏజ్‌లో దాదాపు 12 ఏళ్ల తేడా ఉండడమే. అంతేకాదు, మలైకా అరోరా.. గతంలోనే భర్త అర్భాజ్ ఖాన్‌‌కు విడాకులు ఇచ్చింది. అలాగే, ఆమెకు ఓ అబ్బాయి కూడా ఉన్నాడు. అయినప్పటికీ అర్జున్‌తో డేటింగ్ చేస్తోంది. అందుకే ఈ జంట యమ సెన్సేషన్ అయింది.

 Clashes Between Malaika Arora and Arjun Kapoor News Goes Hot Topic In Bollywood

పెళ్లి కాకున్నా ఎంజాయ్: తమ మధ్య ఉన్న ఎఫైర్ బహిర్గతం అయిన తర్వాత మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్ మరింతగా ఎంజాయ్ చేస్తోంది. జంటగా ఉండేందుకు ముంబైలో ఓ విలాసవంతమైన ఫ్లాట్‌ను కూడా కొనుక్కున్నారు. అక్కడే కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ విషయాన్ని కూడా వాళ్లే స్వయంగా చెప్పుకున్నారు. అలాగే, నిత్యం టూర్లకు వెళ్తూ చిల్ అవుతున్నారు.

 Clashes Between Malaika Arora and Arjun Kapoor News Goes Hot Topic In Bollywood

పెళ్లి వార్తలు.. కావట్లేదు: దాదాపు పదేళ్లుగా డేటింగ్‌లో ఉన్న అర్జున్ కపూర్, మలైకా అరోరా.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఎన్నో ఏళ్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఇప్పటికే చాలా డేట్లు కూడా తెరపైకి వచ్చాయి. అయినప్పటికీ వీళ్లిద్దరి వివాహం మాత్రం జరగలేదు. అటు అర్జున్ కపూర్.. ఇటు మలైకా అరోరా కూడా ఈ విషయంపై సరైన సమాధానాన్ని మాత్రం చెప్పలేకపోతున్నారు.

 Clashes Between Malaika Arora and Arjun Kapoor News Goes Hot Topic In Bollywood

పెళ్లి వద్దు.. ఎంజాయ్‌గా: మలైకా అరోరాతో పెళ్లికి అర్జున్ కపూర్ సిద్ధంగా లేడని ఈ మధ్య ఓ న్యూస్ బాలీవుడ్‌లో సెన్సేషన్ అయింది. అంతేకాదు, అతడు 'పెళ్లి వద్దు.. ఇలాగే ఉంటూ ఎంజాయ్ చేద్దాం' అంటూ ఆమెకు షాకిచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో వీళ్లిద్దరి మధ్య విభేదాలు కూడా వచ్చాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఈ న్యూస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X