ఈ విషయం ఎన్టీఆర్ అభిమానులు హార్షించతగ్గది..!
విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు అభిమానులందరికి మరోక చక్కని శుభవార్త. నందమూరి తారక రామారావు గారి జీవితంలో మరచిపోలేని, మనంఅందరం కూడా ఆయనను మరియు అభినవపాటాన్ని మరువకూడదని ఉద్దేశ్యంతో గోల్ట్ స్టోన్ టెక్నాలజీస్ అనే సంస్ద మాయాబజార్ లాంటి కలాఖండాన్ని మనకు కలర్ లో అందించింది. అంతేకాకుండా నందమూరి తారక రామారావు రామారావుగారు మరియు అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించినటువంటి మిస్సమ్మ సినిమా, మరియు రామారావు గారి జగదేకవీరుని కధ లాంటి సినిమాలను గోల్ట్ స్టోన్ టెక్నాలజీస్ సంస్ద వారు మరలా రంగుల రూపంలోకి తేవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
దీనిని బట్టి మనకు ఏమి తెలుస్తుందంటే మన తెలుగు సినిమాకి స్వర్ణయుగానికి తెచ్చిపెట్టనటువంటి సినిమాలను వీళ్శు రంగులలోకి తెస్తున్నారని. ఈ రెండు చిత్రాలను త్వరలోనే ప్రేక్షకుల ముందుకి తీసుకురోబోతున్నామని, అంతేకాకుండా వీటితో పాటు నటరత్న సినీజీవితంలో మైలు రాళ్శుగా పేర్కోదగ్గిన మరో మేటి చిత్రాలను కూడా త్వరలో మీ ముందుకు తెస్తామని అన్నారు.


Click it and Unblock the Notifications











