Salaar మూవీ క్లైమాక్స్ లీక్: మైండ్ బ్లోయింగ్ ట్విస్టుతో లాస్ట్ సీన్.. మరో బాహుబలి అంటారేమో!

బడా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు ప్రభాస్. అలా సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించిన అతడు.. ఎన్నో భారీ హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. 'బాహుబలి' సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. అప్పటి నుంచి అయితే అతడిలో జోష్ రెట్టింపు అయిపోయింది. దీంతో ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా బిగ్ ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు 'సలార్' మూవీతో ప్రభాస్ రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ క్లైమాక్స్ లీక్ అయింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!

సలార్‌గా రాబోతున్న ప్రభాస్:ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రమే 'సలార్'. ఈ మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా నటించారు. రవి బస్రూర్ దీనికి మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు సహా ఎంతో మంది చేశారు.

Climax Scene will Be Highlight In Prabhas Starrer Salaar Movie

సలార్ ఫస్ట్ పార్ట్‌ వచ్చేస్తోంది:పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'సలార్' మూవీని సెప్టెంబర్‌లోనే విడుదల చేయాల్సి ఉంది. ఇందులో మంచి ఔట్‌పుట్ ఇవ్వడం కోసం సినిమాను ఒకసారి వాయిదా కూడా వేసేశారు. ఇక, ఇప్పుడు ఈ మూవీలోని ఫస్ట్ పార్టును 'సలార్: సీజ్‌ఫైర్' పేరిట డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా సందడి ప్రపంచ వ్యాప్తంగా బాగా కనిపిస్తోంది.

బుకింగ్స్‌లో అరాచకంగానే:'సలార్: సీజ్‌ఫైర్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. వీటికి ప్రభాస్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ చిత్రం ఓవర్సీస్‌లో ఎప్పుడో 1 మిలియన్ మార్కును, ఇండియాలో రూ. 10 కోట్లు గ్రాస్‌ను క్రాస్ చేసేసింది.

Climax Scene will Be Highlight In Prabhas Starrer Salaar Movie

సలార్‌ క్లైమాక్స్ సీన్ హైలైట్:భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడడంతో దీని నుంచి ఎవరూ ఊహించని ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ హై రేంజ్ సినిమా నుంచి ఓ షాకింగ్ న్యూస్ లీకైంది. ఇందులో క్లైమాక్స్ సీన్ మైండ్ బ్లాక్ ట్విస్టుతో ఎవరూ ఊహించని విధంగా ఉంటుందట.

ఆ ట్విస్టునే క్లైమాక్స్‌గా పెట్టి:'సలార్: సీజ్‌ఫైర్' మూవీని ప్రభాస్ - పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య ఫ్రెండ్‌షిప్ నేపథ్యంతో రూపొందించారని ఇప్పటికే న్యూస్ లీకైంది. అందుకు తగ్గట్లుగానే ఇటీవలే వచ్చిన పాట, ట్రైలర్లు నిరూపించాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్‌కు పృథ్వీరాజ్ వెన్నుపోటు పొడిచే సన్నివేశంతో ఈ సినిమా పూర్తి కాబోతుందట. ఇదే ట్విస్టు క్లైమాక్స్‌గా చూపించబోతున్నారని టాక్.

Climax Scene will Be Highlight In Prabhas Starrer Salaar Movie

మరో బాహుబలి ప్రచారమే:ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సలార్: సీజ్‌ఫైర్' మూవీలో క్లైమాక్స్‌ను ప్రభాస్‌కు వెన్నుపోటు పొడిచే సీన్‌తో ముగించబోతున్నారట. అంటే.. 'బాహుబలి' పార్టు 1లో కట్టప్ప బాహుబలిని చంపినట్లు ఇది ఉంటుందన్న మాట. ఆ తర్వాత కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది బాగా ప్రచారం చేశారు. సలార్‌లోనూ ఇప్పుడు అదే ఫార్ములా వాడబోతున్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X