twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీఎం ప్రమేయంతోనే బాలకృష్ణకు ‘నంది’ దక్కిందా?

    By Bojja Kumar
    |

    2010 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో సింహా సినిమాలో నటనకు గాను...బాలకృష్ణకు ఉత్తమ నటుడు అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అయితే...బాలకృష్ణకు ఈ అవార్డు దక్కడం వెనక సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది.

    వాస్తవానికి నంది అవార్డుల కమిటీ తొలుత....ఉత్తమ నటుడు కేటగిరీ కింద వేదం సినిమాలో అద్భుతమైన నటనకు గాను అల్లు అర్జున్ ను ఎంపిక చేశారని, అయితే...సీఎం కిరణ్ కుమార్ ఒత్తిడితో బాలకృష్ణకు కేటాయించారని తెలుస్తోంది. కిరణ్, బాలకృష్ణ కాలేజీ రోజుల నుంచి మంచి మిత్రులు కావడమే ఇందుకు కారణమట.

    తాను సీఎం పదివిలో ఎంతకాలం ఉంటానో గ్యారంటీ లేదు కాబట్టి....పదవి ఉన్నప్పుడే తన మిత్రుడు బాలకృష్ణకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశ్యంతోనే కిరణ్ ఈ పనికి పూనుకున్నట్లు చర్చించుకుంటున్నారు. పైగా 'సింహా" బంపర్ హిట్ కావడంతో ఎవరూ తప్పు పట్టే అవకాశం లేదనే భావనతో నంది అవార్డు కమిటీ కూడా సీఎం ఒత్తిడికి తలొగ్గారని భోగట్టా. అయితే, ఇటువంటి ప్రచారం బాలకృష్ణ నటనాశక్తిని తక్కువగా అంచనా వేయడమేనని అంటున్నారు. గిట్టనివారే బాలకృష్ణపై ఇటువంటి ప్రచారానికి దిగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

    English summary
    Nandi committee considered Allu Arjun for the best actor award but there was a heavy pressure from Chief Minister Kiran Kumar Reddy on Nandi award committee.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X