డైరెక్టర్ హీరో మధ్య కోల్డ్‌వార్, కారణం అదేనా..

మెగా హీరో సాయిధరమ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ కరుణాకరన్ సినిమాపై రోజుకో వార్త బ‌య‌టికి వస్తోంది. రెండు మూడు రోజుల్లో ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్. అధికారికంగా ప్రకటించకముందే ఈ సినిమాపై రకరకాల టైటిల్స్ బయటికి వచ్చాయి. కానీ ఆ టైటిల్స్ లో నిజం లేదని సమాచారం. టైటిల్ విషయంలో హీరో, డైరెక్టర్ల మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తున్నది.

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా

కరుణాకరన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్, జూలై మాసంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ సినిమా లవ్ స్టొరీ

ఈ సినిమా లవ్ స్టొరీ

దర్శకుడు కరుణాకరన్ గతంలో ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా కూడా తొలిప్రేమ ద‌ర్శ‌కుడు అనే ముద్ర ఇప్ప‌టికీ క‌రుణాక‌ర‌ణ్ ను కాపాడుతుంది. అందుకే ఇప్ప‌టికీ ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. మరి ఈ సినిమా ఆ నమ్మకాన్ని నిలబెడుతోందో చూడాలి. ప్యూర్ లవ్ స్టోరి తో ఈ సినిమా విడుదల కాబోతోందని సమాచారం.

డైరెక్టర్ ఫైర్ అయ్యాడు

డైరెక్టర్ ఫైర్ అయ్యాడు

తాజాగా ఈ సినిమాపై ఒక వార్త ప్రచారంలో ఉంది. అదేంటంటే... ఈ చిత్ర దర్శకుడు కరుణాకరన్ సినిమాకు సంభందించిన నాలుగు టైటిల్ ను కొన్ని మీడియా, వెబ్ సైట్స్ కు లీక్ చేసాడంట, ఏ టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తే ఆ టైటిల్ ఫిక్స్ చేద్దామనేది దర్శకుడి ఆలోచన. కాని పద్ధతి హీరో సాయిధరమ్ కు నచ్చలేదని డైరెక్టర్ పై క్లాస్ పీకాడని సమాచారం.

కాపి కథతో సినిమా

కాపి కథతో సినిమా

టైటిల్ బయటకు లీక్ చేసి అందులో మంచి రెస్పాన్స్ వచ్చిన టైటిల్ పెట్టాలనే థాట్ బాగాలేదని సాయిధరమ్ తేజ్ డైరెక్టర్ పై తీవ్ర స్థాయిలో మండిపడినట్లు సమాచారం. సినిమా కథ విషయంలో కూడా సాయి డైరెక్టర్ పై పలు అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హిందీలో వచ్చిన ది వావ్ సినిమాకు కాపీగా బయట చెప్పుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X