Don't Miss!
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Sports మా భారత క్రికెటర్లకు ఇంకా ఆ గతి పట్టలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య చిచ్చుపెట్టిన లక్స్ సోప్...?!
ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య ఒళ్ళు రుద్దుకునే సబ్బొకటి చిచ్చు పెట్టిందనే వార్తలొస్తున్నాయి. ఆ ముద్దుగుమ్మలెవరంటే... కాజల్, ఆసిన్! ఆ సబ్బు ఏమిటంటే... ఎంతో చరిత్ర వున్న లక్స్ సబ్బు! ఇంతకీ అసలు విషయం ఏమిటంటే... తమ ప్రాడక్ట్ ప్రచారం కోసం ప్రతి ఏడాది ఈ లక్స్ సంస్థ, పెద్ద మొత్తంలో పారితోషికాన్నిచ్చి అందాల హీరోయిన్లతో ప్రచార చిత్రాలు రూపొందిస్తుంటుంది.
అలా ఈ ఏడాది కాజల్, అసిన్ లను తన అంబాసడార్లుగా ఎంచుకుంది. వీరిద్దరూ కూడా ఈ ప్రచార చిత్రం షూటింగు సమయంలో ఎంతో సన్నిహితంగా, స్నేహంగా మెలిగారు. అయితే, యాడ్ రిలీజ్ అయ్యాక, అసిన్ చిర్రుబుర్రులాడుతోందట. కారణం ఏమిటంటే, ఆ చిత్రంలో తన కన్నా కాజల్ అందంగా వుండి, క్రెడిట్ అంతా కొట్టేస్తోందని అందరూ అసిన్ కి చెబుతున్నారట. దాంతో, ఈ మల్లూ బేబీ కాజల్ తో మాట్లాడడం మానేసిందని అంటున్నారు. కాజల్ ఫోన్ చేసినా అసిన్ రెస్పాండ్ కావడం లేదట. దాంతో... పాపం కాజల్ 'ఇదేమిటబ్బా.... నేను అందంగా ఉండడమే పాపమా?' అనుకుని బాధపడుతోందట! అయితే కాజల్ ఇదంతా కావాలనే చేస్తోంది. టాప్ లెస్ తో చేసిన పబ్లిసిటి చాలక మళ్ళీ ఇదో రకం పబ్లిసిటీ మొదలెట్టిందంటున్నారు కొందరు.