Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సెట్లో కాజల్, తాప్సీ ఫైట్...డైరక్టర్ కి టెన్షన్
కాజల్, తాప్సీ ఇద్దరూ రీసెంట్ గా రవితేజ హీరోగా చేస్తున్న 'వీర"చిత్రంలో హీరోయిన్స్ గా చేస్తున్నారు. అయితే ఇద్దరికీ ఈ షూటింగ్ సమయంలో ఇగో సమస్యలు తలెత్తాయి. నేను గొప్పంటే..నేను గొప్పనే సిట్యువేషన్ వచ్చింది. మాటలు యుద్దం కాస్తా...ముదిరి కోల్డ్ వార్ గా మారింది. దాంతో వీరి కాంబినేషన్ సీన్స్ అంటే డైరక్టర్ కి టెన్షన్ గా మారింది. ఇదంతా వీర షూటింగ్ స్పాట్ లో చోటుచేసుకుంది. వీరిద్దరూ మొదట సఖ్యంగానే ఉన్నా కొద్దిరోజులకు ఒకరంటే ఒకరికి పడని సిట్యువేషన్ వచ్చేసింది. దీంతో కాజల్‌కు, తాప్సీకి మధ్య పెద్ద గొడవే అంతర్గతంగా సాగింది. వీరిద్దరినీ శాంతింపచేయడానికి యూనిట్లో అనేకమంది ప్రయత్నించినా ఇద్దరూ ఎవరి మాటా వినలేదని తెలుస్తోంది.దర్సక ,నిర్మాతలు వీరిని శాంతింప చేసే భాధ్యత రవితేజపై పెట్టారు. కానీ అతను ఎంత ప్రయత్నించినా వారి మధ్య సఖ్యత కుదర్చలేకపోయాడు. అదీ సంగతి.
ఇక 'వీర' లో కాజల్ కబడ్డి చిట్టి అనే మాస్ పాత్రలో కనిపించనుంది. ఇక మరో హీరోయిన్ గా చేస్తన్న తాప్సీ ఐటీ స్టూడెంట్ గా అలరిస్తుంది. కిక్ శ్యామ్ పోలీస్ ఆపీసర్ గానూ, అతని భార్యగా శ్రేదేవి చేస్తున్న ఈ చిత్రంలో నాగబాబు ఓ కీలకమైన పాత్రలో కనిపిస్తాడు. ఈ చిత్రాన్ని గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవలే అరకులో ఫైటింగ్ సీన్స్ చిత్రీకరించారు. ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ జరుగుతోంది. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సంగీతం: తమన్.