వీడియో సంచలనం: ఐశ్వర్యరాయ్ కుటుంబంలో చిచ్చు, ఏం జరిగింది?

By Bojja Kumar

Recommended Video

ఐశ్వర్యరాయ్ కుటుంబంలో చిచ్చు.. ఏం జరిగింది?

అనుష్క శర్మ, విరాట్ కోహ్లి ఇటీవల ముంబైలో గ్రాండ్‌గా తమ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడకకు బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. బచ్చన్ ఫ్యామిలీ నుండి అమితాబ్ బచ్చన్, శ్వేతా బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఐశ్వర్యరాయ్, శ్వేతా బచ్చన్ ప్రవర్తన కాస్త తేడాగా ఉండటమే ఇందుకు కారణం.

 ఏం జరిగింది?

ఏం జరిగింది?

విరాట్ కోహ్లి-అనుష్క శర్మ వెడ్డింగ్ రిసెప్షన్‌కు తన భర్త అభిషేక్‌తో కలిసి ఐశ్వర్యరాయ్...... తండ్రి అమితాబ్‌తో కలిసి శ్వేతా హాజరయ్యారు. భుజం గాయంతో ఉన్న తండ్రిని తన చేయి పట్టుకుని తీసుకొచ్చింది శ్వేత.

ఆడపడుచుతో ఐశ్వర్యకు పడటం లేదా?

ఆడపడుచుతో ఐశ్వర్యకు పడటం లేదా?

వెడ్డింగ్ రిసెప్షన్లో ఐశ్వర్యరాయ్, శ్వేతా ప్రర్తించిన తీరు ప్రతి ఒక్కరిలోనూ అనుమానాలు రేకెత్తిస్తోంది. వీరు ఇక్కడ కుటుంబ సభ్యుల్లా ప్రవర్తించలేదని, అంటీ ముట్టన్లు... ఎడమొహం, పెడమొహంగా ఉన్నారని చర్చించుకుంటున్నారు.

 వీడియోతో మరింత క్లారిటీ

వీడియోతో మరింత క్లారిటీ

ఐశ్వర్యరాయ్, శ్వేతా బచ్చన్ ప్రవర్తనకు సంబంధించి వీడియో సాక్ష్యం ఉండటంతో.... బచ్చన్ కుటుంబంలో ఏదో ఒక విషయంలో చిచ్చు రేగిందని, అంతర్గతంగా ఏవో గొడవల జరిగి ఉంటాయనే వాదన తెరపైకి వచ్చింది.

అయిష్టంగానే ఫోటోలకు ఫోజులు

అయిష్టంగానే ఫోటోలకు ఫోజులు

నలుగురూ కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వాలని మీడియా వారు కోరగా.... భర్త బలవంతం మీద ఐశ్వర్యరాయ్, తండ్రి బలవంతం మీద శ్వేత ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. సమస్య ఆ ఇద్దరి మధ్యే అయి ఉంటుందని భావిస్తున్నారు.

 కంఫర్టుగా కనిపించలేదు

కంఫర్టుగా కనిపించలేదు

ఏం గొడవ జరిగిందో తెలియదు కానీ.... ఇటు భార్యకు సర్దిచెప్పుకోలేక అభిషేక్ బచ్చన్, కూతురుని ఏమీ అనలేక అమితాబ్ లోలోన సతమతం అయినట్లు వారి ముఖకవలికలు చూస్తే స్పష్టం అవుతోందని అంటున్నారు.

ఫ్యామిలీలో వచ్చిన గ్యాపేనా?

ఫ్యామిలీలో వచ్చిన గ్యాపేనా?

నలుగురూ కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వాలని మీడియా వారు కోరగా..... అయిష్టంగానే నిల్చుకున్నారు. ఇద్దరు బచ్చన్ లేడీస్ మధ్య చాలా గ్యాప్ కనిపించింది. ఫ్యామిలీ విషయాల్లో ఇద్దరి మధ్య ఏదో ఒక విషయంలో గ్యాప్ రావడం వల్లనే ఇలా జరిగిందనే వాదన వినిపిస్తోంది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

సోషల్ మీడియాలో బచ్చన్ ఫ్యామిలీకి చెందిన వీడియో వైరల్ అయింది. ఇది కేవలం మీడియా క్రియేట్ చేసిన ప్రకంపనలా.... లేక నిజంగానే బచ్చన్ ఫ్యామిలీలో ఏమైనా గొడవలు ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X