మహేష్ చిత్రంలో కలర్స్ స్వాతి గెస్ట్ రోల్
కందిరీగ లో గెస్ట్ క్యారెక్టర్ వేసి అలాంటి పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలర్స్ స్వాతికి తాజాగా మహేష్ సినిమాలో ఓ పాత్ర దొరికిందని సమాచారం. పూరీ జగన్నాద్,మహేష్ కాంబినేషన్ లో రూపొందనున్న ది బజినెస్ మ్యాన్ చిత్రంలో ఆమెను ఓ పాత్ర కోసం రీసెంట్ గా నిర్మాతలు సంప్రదించారని చెప్తున్నారు. అష్టాచెమ్మలో మహేష్ కు వీరాభిమానిగా కనిపించిన స్వాతి ఈ చిత్రంలో ఆఫర్ రావటం తన అదృష్టం గా భావిస్తోంది. ఇక హీరోయిన్ గా కాజల్ ఈ చిత్రంలో మహేష్ సరసన చేయనుంది.ముంబై నేపథ్యంలోసాగే మాఫియా కథ 'ది బిజినెస్‌మ్యాన్'. ఇంతవరకూ మహేష్ బాబు చేయనటువంటి పాత్ర ఇది. 'బిజినెస్‌మ్యాన్'గా టైటిల్‌కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఆయన రూపొందించబోయే చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. రీసెంట్ గానే ఈ చిత్రం ఓపినింగ్ జరిగింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











