భారీ పారితోషకం పుచ్చుకున్న కలర్స్ స్వాతి!
విక్టరి వెంకటేష్ త్రిష నటించిన చిత్రం 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే", సినిమా'అష్టాచెమ్మా" చిత్రం ద్వారా తెలుగులో, శశికుమార్ దర్శకత్వంలో 'సుబ్రహ్మణ్యపురం" చిత్రం ద్వారా తమిళంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫిల్మిం ఫేర్ అవార్డు గ్రహీత తెలుగు యాక్టర్ 'కలర్స్" స్వాతి తాజాగా ఓ కన్నడ చిత్రంలో నటించేందుకు అంగీకరించిందని తెలుస్తోంది.
తమిళంలో ప్రస్తుతం విక్రమ్ హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో స్వాతి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటు తెలుగు, అటు తమిళంలో స్వాతికి ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని భారీ పారితోషికం చెల్లించి మరీ కన్నడ చిత్రంలో ఈ కలర్స్ భామను తీసుకున్నారని తెలుస్తోంది. ప్రముఖ కన్నడ దర్శకుడు చందురు దర్శకత్వంలో హ్యాట్రిక్ యాక్టర్ శివరాజ్ కుమార్ హీరోగా రూపొందనున్న ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
More from Filmibeat
కలర్స్ స్వాతి శివరాజ్ కుమార్ చందురు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సుబ్రహ్మణ్యపురం కన్నడ సినిమా colours swathi shivaraj kumar chandru kannada film aadavari matalaku arthale verule


Click it and Unblock the Notifications











