కలర్స్ స్వాతి...‘తొక్కుడు బిళ్ళ’ వర్కవుట్ అవుతుందా?

By Srikanya

'అష్టాచెమ్మా" చిత్రంతో విజయం సాధించిన ఇంద్రగంటి మోహనకృష్ణ ఇప్పుడు సుమంత్, స్వాతి జంటగా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో ఉండే ఈ చిత్రానికి 'అష్టాచెమ్మా" తరహాలోనే 'తొక్కుడు బిళ్ళ" అని పేరు పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. ది మేన్ వితిన్ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ గా ఈ చిత్రం కథ నడుస్తుంది. హరి మోహన్ కథ అందిస్తున్నారు. మోహన్ కృష్ణ దర్శకత్వమే కాకుండా డైలాగులు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రం బడ్జెట్ ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర కోట్లు అని సమాచారం. ఇంతకు ముందు అష్ఠాచెమ్మ చిత్రం నిర్మాణానికి ఒకటిన్నర కోటి ఖర్చు పెట్టిన నిర్మాత పి.రాంమోహన్ ఇప్పుడు కథమీద ఉన్న నమ్మకంతోనే ఈ రేంజి బడ్జెట్ కేటాయించాడని తెలుస్తోంది. అలాగే సినిమాకి నలభై లక్షలు దాకా ఛార్జ్ చేసే సెంధిల్ కుమార్(మగధీర, అరుంధతి) కెమెరా వర్క్ చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X