పవన్ కల్యాణ్‌కు అలీ దూరం.. కారణం అదేనట..
Recommended Video

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, కమెడియన్ కమ్ హీరో అలీ మధ్య ఉన్న అనుబంధం చాలా గొప్పదన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలిప్రేమ చిత్రంతో వారిద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. ఖుషీలో వీరి జోడికి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి పవన్, అలీ మధ్య ఎవరూ విడదీయలేనంత మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే ఇటీవల పవన్, అలీ మధ్య విభేదాలు ఏవో వచ్చాయనే వార్తలు మీడియాలో షికారు చేశాయి. అందుకు దారి తీసిన పరిస్థితులు ఇవే..

పవన్ కల్యాణ్ సినిమాలో ఉండాల్సిందే..
పవన్ కల్యాణ్ ఏ సినిమా అయినా అలీ ఉండి తీరాల్సిందే. పాత్ర లేకపోయినా కొత్తగా సృష్టించైనా ఆయన పాత్రను కథలో చేర్చాలిందే. అలీ పక్కన ఉంటే పవన్ ముఖం బ్రహ్మండంగా వెలిగిపోతుంది. పవర్ స్టార్ చాలా ఆనందంగా కనిపిస్తాడు.

అజ్ఞాతవాసిలో అలీ లేడా?
అలాంటిది ప్రస్తుతం అజ్ఞాతవాసి చిత్రంలో అలీకి పాత్రలేదనే వార్తతో ఈ రూమర్లకు బలం చేకూరింది. విభేదాల కారణంగానే పవన్ సినిమాకు అలీ దూరం అయ్యాడు అనే న్యూస్ పలువెబ్‌సైట్లో హల్‌చల్ చేశాయి.

అలీ నటించకపోవడంపై
పవన్ కల్యాణ్ చిత్రంలో అలీ లేకపోవడానికి ప్రధాన కారణాన్ని ఆయన సన్నిహితులు వెల్లడించారు. దాంతో అలీ ఎందుకు నటించలేదనే వార్తపై క్లారిటీ వచ్చింది. ఇంతకీ పవన్ సినిమాకు దూరంగా ఉండటానికి అసలు కారణం తెలిసిన సినీ వర్గాలు ఆశ్చర్యపోయారు.

వ్యక్తిగత పనుల్లో బిజీగా
అలీ వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉండటం, అంతేకాకుండా పలు సినిమాలు, టెలివిజన్ షోలలో తలమునకలై ఉండటం వల్ల పవన్ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారట. అంతేకాకుండా ఇటీవల అలీ పవిత్ర మక్కా పర్యటనకు వెళ్లారు.

పవిత్ర మక్కాలో అలీ
మక్కాలోని పవిత్ర రాయి వద్ద సంప్రదాయ దుస్తుల్లో అలీ తన కుమారుడితో ఫోటో దిగారు. ఆ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. దాంతో ఆ రూమర్లకు తెరపడింది. అయితే అజ్ఞాతవాసి చిత్రంలో అలీ నటించాడు అనే మరో వాదన కూడా వినిపిస్తున్నది. ప్రస్తుతం ఆ సినిమా విడుదలైతే కానీ ఎన్నో ఏళ్లుగా అలీ, పవన్ కలిసి నటించే ట్రేడిషన్ కొనసాగిందా లేదా అనే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.

జనవరి 10న అజ్ఞాతవాసి
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం జనవరి 10న రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ చిత్రంలో పవన్ పాడిన పాట డిసెంబర్ 31న రిలీజ్ చేయనున్నారు. అత్తారింటికి దారేది చిత్రంలో మాదిరిగానే ఈ చిత్రంలో కూడా కొడుకా కోటేశ్వరరావా అనే పాటను పడగా.. ఇటీవలే దానిని రికార్డు చేశారు.


Click it and Unblock the Notifications











