ముమైత్ నే పెళ్ళాడాతానంటున్న...
ఐటం గర్ల్ నుండి హీరోయిన్ ఓరియెంటెడ్ స్ధాయికి ఎదిగిన భారీ అందాల ముమైత్ కి పెళ్ళి గడియలు దగ్గరకొచ్చాయని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే వరుడు మరెవరో కాదు ప్రముఖ హాస్య నటుడు అలీ తమ్ముడు ఖయ్యాం. ఈ మధ్యన తరుచూ సినిమాల్లో ఏదో ఒక పాత్రలో(ముఖ్యంగా పూరీ సినిమాల్లో) కనపడుతున్న అతను ..ముమైత్ పై మనస్సు పడ్డాడని సమాచారం.దానికి ముమైత్ కూడా పచ్చజెండా ఊపిందని చెప్తున్నారు.
అలాగే ఈ విషయానికి పూరీ కూడా సపోర్టుగా నిలబడే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఇక ముమైత్ ...ఖయ్యాం అయితే కుల,మత వర్గ విభేధం లేకుండా ..అన్ని విధాలుగా వివాహానికి కరెక్టు అని ఆమె భావించిందనీ..అయితే అతనూ సినిమాల్లో కాస్త నిలబడితే బాగుంటుందని అభిప్రాయపడిందని చెప్తున్నారు. ఇక దీనికి ఖయ్యాం కూడా తలఊపి తానూ కష్టపడతానని...త్వరలోనే తన కెరీర్ లో మార్పు చూపెడతానని అప్పుడే డైరక్ట్ గా మ్యారేజ్ ప్రపోజ్ చేస్తానని మాట ఇచ్చాడని అంటున్నారు.అలీ కూడా ఈ విషయానికి సముఖంగానే ఉన్నాడనేది సమాచారం. అయినా డబ్బు,అందం ఒకేసారి కట్టగట్టుకుని వస్తానంటే కాదనేవారెవరు అనేది కొందరి కామెంట్ ...అది వేరే సంగతి.


Click it and Unblock the Notifications











