ప్రభాస్ మారుతి సినిమా పాయింట్ లీక్ చేసిన కమెడియన్.. ఇక ఫ్యాన్స్ కు పండగే..
కామెడీ, యాక్షన్, రొమాంటిక్ ఇలా ఎలాంటి క్యారెక్టర్ల లోనైనా అద్భుతంగా నటించి అందరి చేత ఆహా అనిపించే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్టైల్, క్యారెక్టరైజేషన్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రభాస్ అండ్ మారుతి హిట్ ఫార్ములా కామెడీయే. ఎక్కువ సినిమాల్లో ప్రభాస్ కామెడీ, రొమాంటిక్ గా కనిపిస్తుంటారు.
ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయకుండానే ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. సినిమా ఏ జోనర్ లో తెరకెక్కుతోందో కూడా ఇప్పటికీ చిత్రబృందం వెల్లడించలేదు. అయితే 'రంగస్థలం' చిత్రానికి పనిచేసిన మహేష్ తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో అతను కూడా ఒక పాత్రలో కనిపించబోతున్నాడు.

మారుతి సినిమాల్లో కామెడీ కచ్చితంగా ఉంటుందని.. నెక్స్ట్ ప్రభాస్, మారుతి కాంబోలో రాబోయే చిత్రం కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందని మహేష్ పేర్కొన్నారు. ఇది చూస్తుంటే ప్రభాస్ తాజా చిత్రం కామెడీ జోనర్ లో ఉంటుందని అర్థం అవుతుంది. అలాగే ప్రభాస్ గత చిత్రాలైనా మిస్టర్ పర్ ఫెక్ట్, డార్లింగ్ వంటి చిత్రాలలో కనిపించిన హై ఎనర్జీ కూడా ఈ కనిపిస్తుందని అన్నాడు.
నటిసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ లో ఇటీవలే ప్రభాస్ కనిపించాడు. అయితే అదే లుక్ లో ప్రభాస్ ఈ సినిమాలో కనిపిస్తాడని.. కాకపోతే మరింత స్టైలిష్ లుక్ లో దర్శనం ఇస్తాడని మహేష్ చెప్పాడు. ఎప్పటిలాగే సినిమా సెట్‌లో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతోందని వివరించాడు. సెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభాస్ తన ఇంటి నుంచే భోజనం తెప్పిస్తున్నాడని తెలిపాడు.

ఒకసారి ప్రభాస్ తనను స్టేజ్‌పైకి పిలిచి నీకు ఇష్టమైన ఆహారం ఏంటని అడిగాడని... ఎందుకూ అంటే నువ్వైతే చెప్పు అని అన్నట్లు గుర్తు చేసుకున్నాడు. మహేష్ తనకు మటన్ అంటే ఇష్టమని చెప్పగా.. ఆ తర్వాతి రోజు మటన్ తో ఓ పది రకాల ఐటమ్స్ తీసుకొచ్చినట్లు వివరించాడు. ప్రభాస్ చూపించే ప్రేమకు తాను ఫిదా అయినట్లు వివరించాడు. ఏది ఏమైనా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజే వేరు.


Click it and Unblock the Notifications











