ఎమ్మెస్ నారాయణ కుమార్తె దర్శకురాలిగా...డిటేల్స్

2012 లో వచ్చిన Thattathin Marayathu అనే మలయాళ మూవిని రీమేక్ చేస్తూ ఆమె దర్శకురాలిగా లాంచ్ కానుందని సమాచారం. అయితే అందులో విక్రమ్ నటిస్తాడా లేదా అన్న విషయం తెలియదు. ఇక ఓ ఎన్నారై నిర్మాత ఈ చిత్రం ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది. ఆమె ఈ చిత్రంతో మహిళా దర్శకురాలిగా తెలుగులో సక్సెస్ అయ్యి సెటిల్ అవ్వాలని ధట్స్ తెలుగు కోరుకుంటోంది.
ఎమ్మెస్ నారాయణ తను దర్శకుడుగా ఫెయిల్ అవటం గురించి చెప్తూ... నా ఇమేజ్ వాడికి అడ్డంకి అయ్యింది. నాలాగే వాడూ నవ్విస్తాడనుకున్నారు ప్రేక్షకులు. అందుకే 'కొడుకు' సినిమా వాళ్లని నిరుత్సాహపరిచింది. నాకు ఫైన్ ఆర్ట్స్ తెలుసు కానీ కామర్స్ తెలియదు. నేను చదివింది బీఏ... బీకామ్ కాదు. అందుకని కమర్షియల్ ఎస్టిమేషన్ తెలియలేదు. పెద్దపెద్ద నిర్మాతలే వాళ్ల తనయుల్ని సక్సెస్ చేయలేకపోతున్నారు. నేనెంత? డబ్బుపెట్టి, మంచి సినిమా తీయడం మాత్రమే కాదు.. ఆ సినిమాని కమర్షియల్‌గా వర్కవుట్ చేసుకోవడం కూడా తెలియాలి. మా అబ్బాయి హీరోగా నేను 'కొడుకు' సినిమాని బాగానే తీశాను. నన్నెవరూ తప్పు పట్టలేదు. విక్రమ్‌నీ తప్పు పట్టలేదు. బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా రిలీజ్ చేయడం చేత కాలేదు. పంపిణీ వ్యవస్థ గురించి నాకిప్పటికీ తెలియదు. థియేటర్లో ప్రేక్షకులు కొనుక్కునే టికెట్ డబ్బు నిర్మాతకు ఎలా చేరుతుందో తెలియదు. ఆ మార్గం తెలిసుంటే 'కొడుకు' సేఫ్ ప్రాజెక్టే అన్నారు.
ఆ చిత్రం ద్వారా ఆర్థికంగా బాగానే నష్టపోయిన విషయం గురించి చెప్తూ... అవును. అయినా అదేం పెద్ద లెక్క కాదు. ఎందుకంటే, దానికంటే ఎక్కువే సంపాదించాను. ఓ ప్రయత్నం చేయాలనుకుని చేశాను. దాన్ని ఓటమి అనుకోవడంలేదు.కమెడియన్ కొడుకు కమెడియనే ఎందుకవ్వాలి అని మనం అనుకోవచ్చు. కానీ ప్రేక్షకులు అనుకోరు. వాళ్ల అభిప్రాయాన్ని మార్చలేముగా! విక్రమ్‌తో సినిమా చేసేటప్పుడు.. నగేష్‌గారి కొడుకు ఆనంద్ సక్సెస్ అవ్వలేదు. ఇంకా కొంతమంది హాస్యనటుల కొడుకులు సక్సెస్ అవ్వలేదని కొంతమంది ఉదాహరణలు చెప్పారు. మా అబ్బాయి పక్కా హీరో మెటీరియలే అనే కాన్ఫిడెన్స్‌తోనే తీశాను. కెమెరా ముందు హైటు ప్రాబ్లమ్ ఉండదు. ఉదాహరణకు మన హీరోల్లో.. హైటు తక్కువ ఉన్నవాళ్లల్లో కూడా అద్భుతమైన హీరోలు ఉన్నారు. ఇతర భాషల్లో కూడా హైటు తక్కువ ఉన్నవాళ్లల్లో మంచి హీరోలు చాలామందే ఉన్నారు అన్నారు.


Click it and Unblock the Notifications











