దర్శకుడిగా మారబోతున్న స్టార్ కమెడియన్ ప్రియదర్శి.. చిన్న హీరోతో భారీ ప్రయోగం
టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న వారిలో ప్రియదర్శి ఒకరు. పెళ్లి చూపులు సినిమా నుంచి నాన్ స్టాప్ గా సినిమాలు చేసుకుంటూ వస్తున్న దర్శి మూడేళ్లలోనే చాలా బిజీ అయ్యాడు. కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు. ఇక త్వరలో దర్శకుడిగా కూడా అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఆ సినిమా నుంచి..
కమెడియన్ ప్రియదర్శి మొదట టెర్రర్ అనే సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు. శ్రీకాంత్ హీరోగా నటించిన ఆ సినిమాలో ఒక టెర్రరిస్ట్ గా కనిపించిన ప్రియదర్శికి అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. ఇక ఆ తరువాత అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన పెళ్లి చూపులు సినిమాతో మొదటి ఛాన్స్ దక్కింది.

వరుసగా 15 సినిమాలు
పెళ్లి చూపులు సక్సెస్ తరువాత ఒక ఏడాదిలో 15సినిమాలు చేసి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఏడాదికి కనీసం 12 సినిమాలకు తక్కువ చేయడం లేదు. కేవలం కామెడీ పాత్రలనే కాకుండా సపోర్టింగ్ రోల్స్ నార్మల్ రోల్స్ కూడా చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా జాతిరత్నాలు సినిమాతో మరోసారి తన టాలెంట్ ను బయటపెట్టాడు.

దర్శకుడిగా ప్రియదర్శి
అయితే త్వరలో ఈ స్టార్ కమెడియన్ దర్శకుడిగా కూడా అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. కథలు రాయడం డైరెక్షన్ చేయడమంటే చాలా ఇష్టమని గత ఇంటర్వ్యూలలో చాలా సార్లు చెప్పాడు. ఇక ఇప్పుడు మినీ బడ్జెట్ తో ఒక చిన్న హీరోతో తన డ్రీమ్ ను నెరవేర్చుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

ప్రభాస్ సినిమాలో కూడా
ప్రియదర్శి కథను మొత్తం రెడీ చేసుకున్నాడట. ఒక నిర్మాత కూడా స్క్రిప్ట్ కు ఓకే చెప్పినట్లు సమాచారం. వీలైనంత వరకు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన తరువాతనే అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం దర్శి అనిల్ రావిపూడి F3 సినిమాతో పాటు ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ లో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











