RC 15లో సునీల్ స్పెషల్ రోల్.. ఆ పరిచయంతోనే గోల్డెన్ ఛాన్స్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు వరుసగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఒకసారి ఆ లైన్ లోకి వెళ్ళిన హీరోలు మళ్లీ వరుసగా అదే తరహా సినిమాలను చేస్తుండడం విశేషం. ఇప్పటికే ప్రభాస్ తీరికలేకుండా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారిన విషయం తెలిసిందే. ఇక RRR సినిమా విడుదల కాకముందే ఆ సినిమా హీరోలు కూడా అగ్ర దర్శకులతో మరికొన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్, శంకర్ తో RC 15 సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని దర్శకుడు శంకర్ కూడా కాస్త కసిగానే సిద్ధమవుతున్నాడు. మొదటిసారి ఒక తెలుగు హీరోతో సినిమా చేస్తున్న శంకర్ RC 15ను ఏ ఏవిధంగా తెరకెక్కిస్తారో అని అన్ని వర్గాల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అదే విధంగా దర్శకుడు శంకర్ పూర్తి స్థాయిలో టాలీవుడ్ నటీనటులను అలాగే ఇక్కడి టెక్నీషియన్స్ ను ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవడం విశేషం. ఈ సినిమాలో సునీల్ కూడా నటించబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఈ సినిమాలో శంకర్ సునీల్ ను తీసుకోవడానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉందట.

Comedian special negative role in ram charan 15th project

గతంలో సునీల్ శంకర్ దర్శకత్వం వహించిన త్రీ ఇడియట్స్ రీమేక్ లో స్నేహితుడు సినిమాలో ఒక కమెడియన్ పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. ఆ తర్వాత శంకర్ అతని పనితనానికి మెచ్చి తప్పకుండా భవిష్యత్తులోకి సినిమా చేస్తానని మాట ఇచ్చాడట. రామ్ చరణ్ సినిమా సెట్స్ పైకి రావడంతో శంకర్ సునీల్ ప్రత్యేకంగా సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అతని పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. ఇక సునీల్ ఎక్కువగా మల్టిపుల్ రోల్స్ చేయాలని ఆశ పడుతున్నాడు. ముఖ్యంగా నెగిటివ్ రోల్స్ చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ పెద్దగా అవకాశాలు అయితే రావడం లేదు. అతన్ని ఎక్కువగా కమెడియన్ పాత్రలకి సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ మధ్యలో కలర్ ఫోటో లో కొంత నెగటివ్ షేడ్స్ తో కనిపించి పర్వాలేదనిపించాడు.

ఇంకా చాలా రోజుల అనంతరం శంకర్ కూడా సునీల్ ను ఒక నెగిటివ్ పాత్ర కోసమే సెలెక్ట్ చేసినట్లుగా టాక్ అయితే వస్తోంది. అందుకోసం రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఇస్తున్నారట. ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద సినిమాల్లో నటిస్తున్న సునీల్ సినిమా పై మాత్రం కాస్త ఎక్కువగానే నమ్మకం పెట్టుకున్నాడు. పైగా సునీల్ కు ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాతో మంచి గుర్తింపు అందుకోవచ్చని నెగిటివ్ పాత్ర గురించి శంకర్ చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. మరి ఆ పాత్ర ఎంత వరకు క్లిక్ అవుతుందో చూడాలి.

ఇక ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను వీలైనంత త్వరగా స్టార్ట్ చేసి వచ్చే ఏడాది నవంబర్ లో ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ కుదరలేదు. అందుకే 2023 సంక్రాంతి లో విడుదల చేస్తే బెటర్ అని దిల్ రాజు కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X