బాలకృష్ణ పాలిట విలన్‌గా మారిన స్టార్ కమెడియన్.. ఢీకొట్టడానికి రెడీ అయిపోతున్నాడు.!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుని భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఎన్టీఆర్ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ.. తనలోని టాలెంట్‌తో స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. ఒకానొక సమయంలో వరుస విజయాలతో దూసుకుపోయిన ఆయన టాప్ హీరోగా వెలుగొందారు. ఇక, సీనియర్ అయినప్పటికీ ఇప్పుడు కూడా అంతే ఎనర్జీతో కనిపిస్తూ కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. అలాంటి బాలయ్యకు ఓ కమెడియన్ విలన్‌గా మారాడట. ఇంతకీ ఎవరా కమెడియన్.?

 బాలయ్యకు తప్పని నిరాశ

బాలయ్యకు తప్పని నిరాశ

నందమూరి బాలకృష్ణ అంత స్పీడుగా మరో హీరో సినిమాలు చేయలేడన్న పేరు ఉంది. దానికి తగ్గట్టుగానే గత ఏడాది ఆయన మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందులో ‘యన్.టి.ఆర్' బయోపిక్ రెండు భాగాలతో పాటు ‘రూలర్' ఒకటి. ఈ మూడు సినిమాలూ ఎన్నో అంచనాలతో వచ్చినప్పటికీ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి.

రెండు హిట్ల తర్వాత కలిశారు

రెండు హిట్ల తర్వాత కలిశారు

గతంలో ‘సింహా', ‘లెజెండ్' వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ మరోసారి కలిశారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కబోతోంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

 ఎంతో మంది పేర్లు తెరపైకి

ఎంతో మంది పేర్లు తెరపైకి

ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి దీనిపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. వీరిద్దరి కాంబినేషన్‌ సక్సెస్‌ఫుల్ కావడం వల్లే ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులో నటించే ఆర్టిస్టుల గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో పలానా హీరోయిన్ నటిస్తుందని, పలానా విలన్ నటిస్తున్నాడని ఇలా ఎంతో మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి.

వాటిలాగే ఇందులోనూ ఇద్దరు

వాటిలాగే ఇందులోనూ ఇద్దరు

నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని కూడా కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ‘సింహా', ‘లెజెండ్'లోనూ ఆయన డుయల్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇందులో నటించే రెండు పాత్రల్లో ఒకటి బిజినెస్‌మ్యాన్ రోల్ కాగా.. మరొకటి అఘోరా క్యారెక్టర్ అంటున్నారు. దీంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అవుతోంది.

బాలకృష్ణ పాలిట విలన్‌గా కమెడియన్

బాలకృష్ణ పాలిట విలన్‌గా కమెడియన్

తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ మూవీలో ప్రతినాయకుడిగా ప్రముఖ కమెడియన్ సునీల్ నటించబోతున్నాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా ముగిశాయని ఇండస్ట్రీలో తాజాగా చర్చ జరుగుతోంది. ఈ మధ్య విడుదలైన రవితేజ ‘డిస్కో రాజా'లోనూ ఆయన నెగెటివ్‌ రోల్ చేసిన విషయం తెలిసిందే.

 ఢీకొట్టడానికి రెడీ అయిపోతున్నాడు.!

ఢీకొట్టడానికి రెడీ అయిపోతున్నాడు.!

బోయపాటి సినిమాలో విలన్ అంటే ఎంతో క్రూరంగా కనిపిస్తాడు. అందుకు తగ్గట్లు గానే ఇందులోనూ సునీల్ అలాగే కనిపించబోతున్నాడని అంటున్నారు. ముఖ్యంగా ఈ పాత్ర కోసం అతడు మరోసారి సిక్స్‌ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడని అంటున్నారు. అలాగే, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌తో సునీల్ మెప్పించడానికి రెడీ అవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X