పుష్ప’ నుంచి షాకింగ్ న్యూస్: ఫస్ట్ పార్ట్‌లో కమెడియన్ సునీల్ రోల్ ఊహించని ట్విస్ట్..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'పుష్ప'. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎర్ర చందనం చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోంది. ఫారెస్ట్ అడ్వెంచర్ జోనర్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురించి ఒక విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

భారీ అంచనాలు
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఊహించని రీతిలో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా క్షణాల్లో ట్రెండ్ అవుతూ అందరిలో ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో 'పుష్ప' సినిమాకు సంబంధించిన ఒక షాకింగ్ అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

రెండు భాగాలుగా
ఇప్పటికే పుష్ప సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన దాదాపు 80 శాతం షూటింగ్ కూడా పూర్తైంది. ఇక, ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తోన్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం మొదటి భాగంలో అతడి పాత్ర కేవలం చివరి 20 నిమిషాలకే పరిమితం అవుతుందట.

విలన్ గా సునీల్
అయితే మొదటి భాగంలో అసలు విలన్ కమెడియన్ సునీల్ అని అంటున్నారు. మొదటి భాగంలో ఆయన విలనిజం పండించబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే కలర్ ఫోటోలో ఆయన విలనిజం నచ్చడంతో సుకుమార్ ఇలా ప్లాన్ చేశాడని అంటున్నారు. ఇక హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఈ సినిమాలో సునీల్ భార్యగా నటిస్తోంది.

అనసూయ కూడా రచ్చ
అయితే ముందు ఆమె కేవలం ఒక మూడు నాలుగు సీన్స్ లో మాత్రమే కనిపిస్తుందని అనుకున్నా పుష్ప సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆమె పాత్ర కూడా పెద్దగానే ఉంటుందని అంటున్నారు. ఇక విలన్ అంటూ ముందు నుంచీ ప్రచారం జరుగుతున్న ఫహద్ ఎంట్రీ ప్రీ క్లైమాక్స్‌లోనే ఉంటుందని సమాచారం.

ఫహద్ మాత్రం
అక్కడి నుంచి సినిమా ఎండ్ కార్డ్ పడే వరకూ మొత్తం కేవలం మూడు, నాలుగు సన్నివేశాల్లో ఫహాద్ ఫాజిల్ కనిపిస్తాడని అంటున్నారు. అయితే, రెండో భాగంలో మాత్రం పూర్తి స్థాయిలో దర్శనమిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. ఈ క్రమంలోనే సినిమా పై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











