ఇదేం పని ఏవీయస్?

కానీ ఇప్పుడు ఏవీయస్...లోకం కోడై కూస్తోంది పేరుతో తెలుగు దేశం ప్రచార ప్రకటనలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రేస్ రాజశేఖర్ రెడ్డని,చిరంజీవిని విమర్శిస్తున్నాడు. ఇది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏ ఎండకా గొడుగు పట్టే వాళ్ళను చూసాం కానీ ఇలా మాటిమాటికీ పార్టీలు మార్చి,తనకు సహాయం చేసే వారిని విమర్శిమంచేవాళ్ళను చూడలేదని కామెంట్ చేస్తున్నారు. మరీ ఇంత స్పీడుగా సీన్ మారిస్తే ఎలా అంటున్నారు. కొందరైతై మిగతా పార్టీలు వాళ్ళు తమ పార్టీ ప్రచారం చేసే ఛాన్స్ అతనికివ్వలేదు. తెలుగుదేశం వారు ఆ అవకాశం ఇచ్చారు..కళాకారుడుగా ఎవరు అవకాశమిస్తే వారికి కొమ్ముకాయటం సహజమే కదా..అని వెనకేసుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











