లేడీ ఆర్టిస్టులతో కమెడియన్ కామకలాపాలు...!?

By Sindhu

ఆమధ్య కాలంలో సినీ రంగానికి సంబంధించి అడ్డూ, ఆపూ లేని నోరెవరిదయ్యా అంటే అందరి వేళ్లూ కమెడియన్ వేణుమాధవ్‌ నే చూపించేవి. తను యాంకర్‌ గా వ్యవహరించే లేదా తను పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ అతను తన నోటితో ముతక హాస్యాన్ని కురిపించేవాడు. హాస్యమంటే అతడి దృష్టిలో సెక్సు జోకులు వేయడంగానే కనిపించేది. అట్లా కొంత కాలం అతడి రాజ్యం నడిచింది. కమెడియన్‌ గా యమ బిజీ కావడమే దీనికి కారణం. ఒక యేడాది బ్రహ్మానందం, అలీ, సునీల్ వంటి కమెడియన్లను సైతం వెనక్కి నెట్టి ఎక్కువ సినిమాల్లో నటించడమే గాక అందరి కంటే ఎక్కువ ఆదాయాన్నీ గడించిన చరిత్ర అతడిది. అట్లాంటిది ఇప్పుడు అతడి హవా ఏ మాత్రం కనిపించడం లేదు. ఇటీవలి కాలంలో ఏ కార్యక్రమంలోనూ అతడు యాంకర్‌ గా కనిపించలేదు. సినిమా ఫంక్షన్లలోనూ చాలా అరుదుగా కనిపిస్తున్నాడు. అప్పటి జోరు కూడా అతడి మాటల్లో ఉండటం లేదు. సినిమాలు తగ్గిపోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది.

వేణు మాధవ్ కి అమ్మాయిల పిచ్చి బాగా ఉందట. అందువల్ల అతను కొన్ని మంచి అవకాశాలను కూడా కోల్పోయాడని పరిశ్రమ వర్గాలు అంటుంటాయి. తాజాగా తనకు పరిశ్రమలో ఉన్న పేరును, గుర్తింపును, పరిచయాలను అడ్డం పెట్టుకుని అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటూ, వాళ్లకు ఏదో చేస్తానని చెప్పి తన అవసరాలు తీర్చుకుంటున్నాడనే టాక్ వినబడుతోంది. ఇలాంటి వేషాలు ఎంతో కాలం దాగవు కాబట్టి రేపో, మాపో ఈ విషయాలు బయటపడితే వేణుమాధవ్ పరువు బజారున పడుతుంది...కాబట్టి, అతను తింగరి వేషాలు వేయకుండా జాగ్రత్తాగా ఉంటే అతని కెరీర్ కే మంచిదని పరిశీలకులు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X