సునీల్ సిక్స్ ప్యాక్...మార్ఫింగ్ మాయేనా?
కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన సునీల్ త్వరలో....పూలరంగడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన సునీల్ సిక్స్ ప్యాక్ తో ఉన్న ఫోటోలు ఇటీవల విడుదలయ్యాయి. అయితే అది సునీల్ నిజమైన సిక్స్ బాడీయే అని కొందంటుంటే...మరికొందరు మాత్రం అది మార్ఫింగ్ మాయా జాలం అని వాదిస్తున్నారు.
ఇలా అనుమానాలు రావడం వెనక అనేక కారణాలు ఉన్నాయి. ఈ సినిమా కామెడీ నేపథ్యంలో రూపొందుతుండటం, సినిమా టైటిల్ 'పూల రంగడు' కూడా కామెడీ సినిమా టైటిల్ మాదిరే ఉండటం, దీనికి దర్శకత్వం వహిస్తంది కూడా గతంలో అహనా పెళ్లంట లాంటి కామెడీ చిత్రాలకు దర్శకత్వం వహించిన కామెడీ డైరెక్టర్. సునీల్ కూడా కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన వాడే. ఇన్ని కామెడీల మధ్య ...సునీల్ సిక్స్ ప్యాక్ బాడీ దర్శనం ఇవ్వడం, సునీల్ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాడనే విషయం సినిమా దర్శక నిర్మాతలు గతంలో మచ్చుకైనా వెల్లడించక పోవడాన్ని బట్టి చూస్తే...సునీల్ సినిమాపై అంచనాలు పెంచేందుకే ఇలాంటి సిక్స్ ప్యాక్ మార్ఫింగ్ ఇమేజ్ ను వదిలారనే వార్తలు వినిపిస్తున్నాయి.
అలా అని సునీల్‌ను ఇక్కడ తప్పబట్టలేం. కష్ట పడే తత్వం ఉన్న నటుల్లో సునీల్ ఒకరు. కమెడీయన్ గా ఉన్న తన బాడీ స్టక్చర్ ను అతి తక్కవు కాలంలోనే హీరో రేజంజ్ కి మలుచుకున్నాడు. అంత పట్టుదల ఉన్న సునీల్ కి ఇలాంటి సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ చేయడం అంత కష్టం ఏమీ కాదు. అయితే ఈ సిక్స్ ప్యాక్ ఫోటోపై రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీని గురించి దర్శకన నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











